ETV Bharat / state

అదనపు ఉప్పుడు బియ్యం స్వీకరణకు కేంద్రం విముఖత.! - centra government is not ready to take extra rice from telangana

రాష్ట్రం నుంచి అదనపు ఉప్పుడు బియ్యం సేకరణపై కేంద్రం తన నిర్ణయాన్ని మార్చుకునే ఆలోచన లేదని స్పష్టం చేసినట్లు కనబడుతోంది. ఈ మేరకు మరికొన్ని రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విషయంపై అధికారికంగా ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సమస్యను ప్రధాని నరేంద్రమోదీ దృష్టికి తీసుకువెళ్తే మేలని రాష్ట్ర అధికారులు భావిస్తున్నారు.

fci
ఉప్పుడు బియ్యం
author img

By

Published : Sep 15, 2021, 9:20 AM IST

రాష్ట్రం నుంచి ఉప్పుడు బియ్యం అదనంగా తీసుకునేందుకు కేంద్రం సుముఖత చూపటం లేదు. సాధారణ బియ్యం ఎంతయినా తీసుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తోంది. యాసంగిలో కనీసం 50 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యం తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. కేవలం 24.75 లక్షల టన్నులే తీసుకుంటామంటూ గతంలో కేంద్రం స్పష్టం చేసింది. దీనిపై ఒకట్రెండు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు రావచ్చని సమాచారం. 30 లక్షల టన్నులైనా తీసుకుంటారని రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తుండగా, ఆ అవకాశాలు లేనట్లేనని కేంద్ర మంత్రిత్వశాఖ వర్గాల సమాచారం.

నిల్వలున్నాయి

వాతావరణ మార్పుల కారణంగా యాసంగిలో పండే ధాన్యంలో సింహభాగం ఉప్పుడు బియ్యానికి మాత్రమే అనువుగా ఉంటాయి. గడిచిన సీజనులో 92 లక్షల టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసింది. వాటి నుంచి 62 లక్షల టన్నుల బియ్యం వస్తాయి. నాలుగు నుంచి అయిదేళ్లకు సరిపోయేంత మొత్తంలో నిల్వలు ఉండటంతో ఈసారి ఉప్పుడు బియ్యం ఎక్కువగా తీసుకునే పరిస్థితి లేదని కేంద్రం చెబుతూనే ఉంది. ఇటీవల దిల్లీ వెళ్లిన మంత్రులు, అధికారుల బృందం పలు దఫాలు కేంద్ర ప్రభుత్వంతో మంతనాలు సాగించింది. రాష్ట్ర ప్రభుత్వ వినతిపై పునఃపరిశీలన చేసిన అధికారులు... అదనంగా ఉప్పుడు బియ్యం తీసుకునే పరిస్థితి లేదని తేల్చినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.

ప్రధాని దృష్టికి తీసుకెళ్లాలా?

ముందు చెప్పిన మేరకు 24.75 లక్షల టన్నుల బియ్యానికే ఎఫ్‌సీఐ పరిమితమైతే, దానికి 36.74 లక్షల టన్నుల ధాన్యం సరిపోతాయి. ఇంకా 55.26 లక్షల టన్నుల ధాన్యం రాష్ట్ర ప్రభుత్వం వద్ద మిగిలిపోతుంది. దీన్ని ఏం చేయాలని రాష్ట్ర సర్కారు మల్లగుల్లాలు పడుతోంది. ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ ప్రభుత్వాల తరహాలో ధాన్యాన్ని బహిరంగ వేలంలో విక్రయిస్తే సుమారు రూ. 3 వేల కోట్ల వరకు ప్రభుత్వానికి నష్టం వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సమస్యను ప్రధాని నరేంద్రమోదీ దృష్టికి తీసుకువెళ్తే మేలని రాష్ట్ర అధికారులు భావిస్తున్నారు.

ఇవీ చదవండి: crop: దిగుబడిలో 25 శాతానికి కేంద్రం అనుమతి!

Central Government: బియ్యం సేకరణపై కేంద్రం తాజా మెలిక... నష్టపోతామంటున్న రైతులు

Central Government : '2021-22లో ఉప్పుడు బియ్యం కొనుగోలు చేయబోం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.