ETV Bharat / state

జిలేబీ దుకాణంలోకి దూసుకెళ్లిన కారు.. నలుగురికి గాయాలు - Car crashed into a Jelebi Center

అతి వేగంతో వచ్చిన ఓ కారు జిలేబీ తయారీ దుకాణంలోకి దూసుకెళ్లిన ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్​లో చేటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. కారు బీభత్సానికి భయంతో స్థానికులు పరుగులు తీశారు.

బీభత్సం: జిలేబీ దుకాణంలోకి దూసుకెళ్లిన కారు... నలుగురికి తీవ్ర గాయాలు

author img

By

Published : Dec 8, 2020, 7:08 PM IST

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో కారు బీభత్సం సృష్టించింది. బెంగళూరు- హైదరాబాద్ జాతీయ రహదారిపై నుంచి అతి వేగంతో వచ్చిన కారు పక్కనే ఉన్న మిర్చి, జిలేబీ తయారీ దుకాణాల్లోకి దూసుకెళ్లింది. షాపులో పనిచేస్తున్న నలుగురిపై వేడి నూనె మీదపడి తీవ్రగాయాలయ్యాయి.

కారు బీభత్సానికి భయంతో స్థానికులు పరుగులు తీశారు. బాధితులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. షాద్​నగర్ నుంచి హైదరాబాద్ వైపు వెళుతున్న హోండా సిటి కారు ప్రమాదానికి కారణమైంది. ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్‌లో కారు నడిపిన మహిళ లొంగిపోయింది. కారు బ్రేక్ ఫెయిల్ కావడం వల్ల ప్రమాదం చోటుచేసుకుందని కారు నడిపిన మహిళ పేర్కొంది.

జిలేబీ దుకాణంలోకి దూసుకెళ్లిన కారు

ఇదీ చూడండి: భారత్​ బంద్​ ప్రశాంతం... అక్కడక్కడ స్వల్ప ఉద్రిక్తతలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.