రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పీవీ నరసింహరావు వంతెనపై వస్తున్న ఓ కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఫిల్లర్ నెంబర్ 240 వద్ద చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి.
శంషాబాద్ విమానాశ్రయం నుంచి మెహదీపట్నం వైపు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారును క్రేన్ సాయంతో పక్కకు తొలగించారు. ప్రమాదం వల్ల వంతెనపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విమానాశ్రయానికి వెళ్లే దారిలో ఒక వైపు వాహనాలు భారీగా నిలిచిపోయాయి.
ఇవీ చూడండి: టీఎస్రెడ్కో కుంభకోణంలో కొనసాగుతోన్న అరెస్టుల పర్వం