ETV Bharat / state

'భాజపాకు మద్దతిచ్చిన ఆర్వోపై చర్యలు తీసుకోవాలి' - ghmc election results 2020

భాజపాకు ఏకపక్షంగా మద్దతు ఇచ్చిన ఆర్వోపై చర్యలు తీసుకోవాలని బీఎన్​రెడ్డినగర్​ తెరాస అభ్యర్థి ముద్దగౌని లక్ష్మీప్రసన్న డిమాండ్ చేశారు. 346 ఓట్లు లెక్కించకుండానే భాజపా అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించారని ఆరోపించారు.

BN Reddy nagar Trs candidate Muddagauni Lakshmiprasanna
బీఎన్​రెడ్డినగర్​ తెరాస అభ్యర్థి ముద్దగౌని లక్ష్మీప్రసన్న
author img

By

Published : Dec 5, 2020, 10:57 AM IST

రంగారెడ్డి జిల్లా హయత్​నగర్​ సర్కిల్​-3లోని కౌంటింగ్ కేంద్రంలో విధులు నిర్వహించిన ఆర్వో శశిరేఖపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని బీఎన్​రెడ్డి నగర్​ తెరాస అభ్యర్థి ముద్దగౌని లక్ష్మీప్రసన్న డిమాండ్ చేశారు. శశిరేఖ భాజపాకు ఏకపక్ష మద్దతు ఇచ్చి తమకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

బీఎన్​రెడ్డినగర్​ తెరాస అభ్యర్థి ముద్దగౌని లక్ష్మీప్రసన్న

బీఎన్​రెడ్డి డివిజన్​కు సంబంధించి రీపోలింగ్ చేసి ఆర్వోపై చర్యలు తీసుకోవాలని లక్ష్మీప్రసన్న ఈసీని కోరారు. 346 ఓట్లు లెక్కించకుండానే చివరి 15 నిమిషాల్లో భాజపా అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించారని ఆరోపించారు. కాషాయ పార్టీ గెలుపును సవాల్ చేస్తూ ఈసీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.