ETV Bharat / state

భర్త గెలుపు కోసం బొట్టుపెట్టి భార్య ప్రచారం - బి.యన్.రెడ్డిలో భాజపా ప్రచారం

జీహెచ్​ఎంసీ ఎన్నికల ప్రచారం నేటితో పూర్తి కానున్న నేపథ్యంలో నేతలు ప్రచారంలో వేగం పెంచారు. ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని బి.యన్.రెడ్డి నగర్ భాజపా అభ్యర్థి లచ్చిరెడ్డి తరపున భార్య కవిత ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి బొట్టుపెట్టి ఓటర్లను అభ్యర్థించారు.

bn reddy nagar bjp candidate wife requested voters to ghmc elections 2020
భర్త గెలుపు కోసం బొట్టుపెట్టి భార్య ప్రచారం
author img

By

Published : Nov 29, 2020, 3:42 PM IST

Updated : Nov 29, 2020, 4:41 PM IST

భర్త గెలుపు కోసం బొట్టుపెట్టి భార్య ప్రచారం

నేటితో ప్రచారం ముగియనున్న నేపథ్యంలో ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని బి.యన్.రెడ్డి నగర్ భాజపా అభ్యర్థి లచ్చిరెడ్డి భార్య కవిత ప్రచారంలో దూసుకెళ్తున్నారు. కమలం గుర్తుకు ఓటేసి తన భర్తను కార్పొరేటర్​గా గెలిపించాలని, ప్రతి ఇల్లు తిరుగుతూ బొట్టు పెట్టి ఓటర్లను అభ్యర్థించారు.

తక్కువ సమయం ఉన్నందున తన భర్తకు తోడుగా ఈ ప్రచారం చేస్తున్నట్లు కవిత తెలిపారు. ఏ ఇంటికి వెళ్లినా.. ఏ కాలనీకి వెళ్లినా భాజపాకు బ్రహ్మరథం పడుతున్నారని.. ఆమె అన్నారు.

ఇదీ చూడండి : తెరాసకు 15 సీట్ల కంటే ఎక్కువ రావు: వివేక్

Last Updated : Nov 29, 2020, 4:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.