ETV Bharat / state

Bandi Sanjay on CM KCR: పశ్చిమ బంగాల్​లాగే తెలంగాణలోనూ సీన్​ రిపీట్​: బండి సంజయ్ - రంగారెడ్డి జిల్లా

Bandi Sanjay on CM KCR:ప్రతి భాజపా కార్యకర్త ఓ ఛత్రపతి శివాజీ అని కేసీఆర్ గుర్తు పెట్టుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా కోహెడలో జరుగుతున్న జిల్లా భాజపా శిక్షణ శిబిరం రెండో రోజు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

Bandi Sanjay
రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
author img

By

Published : Dec 19, 2021, 3:36 AM IST

Bandi Sanjay on CM KCR:పశ్చిమ బంగాల్​లాగే తెలంగాణలోనూ సీన్​ రిపీట్​ అవుతుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. నిరుద్యోగులు, విద్యార్థులు, రైతులు ప్రాణాలను బలిగొన్న పాపం కల్వకుంట్ల కుటుంబానిదేనని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల కాపాడాల్సిన ముఖ్యమంత్రి సమస్యలు సృష్టిస్తున్నాడని విమర్శించారు. రంగారెడ్డి జిల్లా కోహెడలో జరుగుతున్న జిల్లా భాజపా శిక్షణ శిబిరం రెండో రోజు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

కార్పొరేట్ కళాశాలలు, స్కూల్స్​తో కుమ్మక్కై విద్యార్థుల ప్రాణాలు బలితీసుకుంటున్నారని ఆరోపించారు. జిమ్మిక్కులతో తమ తప్పులను కప్పిపెడుతూ తప్పులపై తప్పులు చేస్తున్నారని అన్నారు. పిట్ట కథలు చెప్తూ కేసీఆర్ తన అధికారాన్ని కాపాడుకోవాలని చూస్తున్నారని.. భాజపాపై ఆరోపణలు చేస్తూ అల్లర్లు చేయాలని చూస్తున్నాడని అన్నారు. సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన 317 జీవోతో రాష్ట్రంలో నోటిఫికేషన్ వచ్చే పరిస్థితి లేదన్నారు. ఇలా రాత్రికి రాత్రి జీవోలు తీసుకొచ్చి నిరుద్యోగుల ఉసురు తీస్తున్నాడని మండిపడ్డారు.

ఒక్కరోజు దీక్ష

ఇందిరాగాంధీ పార్క్​ వద్ద ధర్నా చౌక్​లో నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని ఒక్కరోజు నిరాహారదీక్ష చేస్తానని బండి సంజయ్ అన్నారు. భాజపా కార్యకర్తలపై దాడులు చేస్తాం.. తిరుగనివ్వమంటున్న కేసీఆర్ ప్రతీ కార్యకర్త ఓ శివాజీ అని గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు. మా శివాజీలు రోడ్డు ఎక్కితే కేసీఆర్ ఎక్కడ తల దాచుకుంటారో చూస్తామన్నారు. తెలియని విషయాలు తెలుసుకునేందుకు శిక్షణ శిబిరాలని.. లక్ష్యం కోసం పనిచేస్తున్న భాజపా ఏ పార్టీ పెట్టని విధంగా దేశవ్యాప్తంగా శిక్షణ పెట్టడం జరుగుతుందన్నారు. బెంగాల్​లో మొదట నాలుగు సీట్లు మాత్రమే గెలిచామని కానీ ఇప్పుడు 77 సీట్లు మనవేనని తెలిపారు. రేపు తెలంగాణలో కూడా జరిగేది ఇదే అన్నారు.

భాజపా తరఫున ఈనెల 27న నోటిఫికేషన్లు ఇవ్వాలంటూ దీక్ష చేస్తా. ఇంటికొక ఉద్యోగమిస్తా అన్నావ్. నిరుద్యోగ భృతి ఇస్తానన్నావ్. మొన్న బెంగాల్​లో కేవలం 4 సీట్ల నుంచి 77 గెలిచాం. తెలంగాణలోనూ అదే సీన్ రిపీట్ అవుద్ది. బంగాల్​లో 150 మంది భాజపా కార్యకర్తలు బలయ్యారు. అనేకమంది కార్యకర్తల ఇళ్లు ధ్వంసమైనాయి. అనేకమంది మహిళలపై అత్యాచారాలు జరిగినయి. శాంతి భద్రతలు కాపాడాల్సిన ముఖ్యమంత్రే వాటిని సృష్టిస్తాడు. సమస్య లేని చోట సమస్యలు సృష్టించడం ఆయన నైజం. ఆయనకు మైండ్ పని చేస్తలేదు. భాజపాను ఉరి తీస్తాడట. కేటీఆర్ వల్ల 27 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. - బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.