ETV Bharat / state

Bandi Sanjay: 'అంబేడ్కర్​ విగ్రహం ఏర్పాటు చేస్తామని.. సచివాలయం నిర్మిస్తున్నారు' - బండి సంజయ్​ వార్తలు

తెరాసను గద్దె దించేందుకే ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ అన్నారు. అమరవీరుల త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణలో ముఖ్యమంత్రి కుటుంబం జల్సాలు చేస్తోందని విమర్శించారు.

Bandi Sanjay
బండి సంజయ్​
author img

By

Published : Aug 31, 2021, 4:19 PM IST

అమరవీరుల త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణలో ముఖ్యమంత్రి కుటుంబం జల్సాలు చేస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ విమర్శించారు. తెరాస ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలించడానికే భాజపా ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టిందని అన్నారు. 1400 మంది తెలంగాణ కోసం అమరులైతే.. 600 మందినే తెరాస ప్రభుత్వం గుర్తించిందన్నారు. సీఎం కేసీఆర్​కు నైతిక విలువలు లేవని ఆరోపించారు. 111 జీవోను రద్దు చేస్తామని చెప్పారు.. కానీ ఇప్పటికీ రద్దు చేయలేదని చెప్పారు. సీఎంకు ఫాం హౌస్​ ఉందని... సీఎం బిడ్డ, కొడుకు, అల్లుడికి ఫాం హౌస్​ ఉందన్నారు. చేవెళ్లలో ఎంత మందికి డబుల్​ బెడ్​ రూం ఇళ్లు వచ్చాయో చెప్పాలన్నారు.

రంగారెడ్డి జిల్లా హైదరాబాద్​కు​ ఆధారం

హైదరాబాద్​కు​ ఆధారం రంగారెడ్డి జిల్లా అని బండి సంజయ్​ అన్నారు. పాలు, కూరగాయలు అన్ని రంగారెడ్డి జిల్లా నుంచే వస్తాయన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన గడ్డ రంగారెడ్డి జిల్లా అని చెప్పారు. తెలంగాణ కోసం ఎంతో మంది ప్రాణ త్యాగం చేశారని గుర్తు చేశారు.

దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిన కేసీఆర్​ వారికి ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చి లాక్కున్నారు. దేశంలో పెద్ద అవినీతిపరుడు సీఎం కేసీఆర్​. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని చెప్పారు. భూమి ఇవ్వడం కాదు ఉన్న భూమినే హరితహారం పేరుతో లాక్కుంటున్నారు. డా.బీఆర్​ అంబేడ్కర్​ జయంతి, వర్ధంతికి నివాళులు అర్పించిన సీఎం ఎవరైనా ఉన్నారంటే అది సీఎం కేసీఆరే. హైదరాబాద్​ నడిఒడ్డున అంబేడ్కర్​ విగ్రహం ఏర్పాటు చేస్తామన్న సీఎం.. 100 రూంలతో సచివాలయం కట్టుకుంటున్నారు.

బండి సంజయ్​, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

Bandi Sanjay: 'అంబేడ్కర్​ విగ్రహం ఏర్పాటు చేస్తామని.. సచివాలయం నిర్మిస్తున్నారు'

ఇదీ చదవండి: TS SCHOOLS REOPEN: రేపు బడులు ప్రారంభిస్తారా లేదా వాయిదా వేస్తారా? సాయంత్రానికి స్పష్టత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.