BJP MP Laxman: రాజ్యసభలో తెలంగాణ వాణి వినిపించడానికి ప్రధాని నరేంద్ర మోదీ నాకు ప్రాతినిధ్యం కల్పించారని రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నేరవేర్చేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. దిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న ఆయనకు పార్టీ శ్రేణులు, నాయకులు ఘనస్వాగతం పలికారు.
తెలంగాణ తరఫున రాజ్యసభలో పోరాడేందుకు నాకు అవకాశమిచ్చారు. మోదీ నాయకత్వంలో తెలంగాణలో పార్టీని మరింత బలంగా తయారు చేస్తాం. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నేరవేర్చేందుకు కృషి చేస్తా. పద్మ అవార్డుల విషయంలో కూడా ఒక కొత్త ఒరవడిని తీసుకొచ్చారు. ప్రజలతో మమేకమైన కార్యకర్తలకు లభించిన గౌరవం ఇది. రాజ్యసభలో తెలంగాణ తరఫున తన వంతు పోరాటం చేస్తాం. - లక్ష్మణ్, రాజ్యసభ ఎంపీ
పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్న వారికి ఈ అవకాశం కల్పించారని తెలిపారు. తెలంగాణలో కూడా యూపీ తరహా పాలన రావాల్సిన అవసరముందన్నారు. రాష్ట్రంలో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు తెలంగాణలో అవినీతి రహిత, కుటుంబ పాలనను అంతం చేసేందుకు కృషి చేస్తామని ఎంపీ లక్ష్మణ్ అన్నారు.
దేశంలోనే పెద్ద రాష్ట్రమైన యూపీ నుంచి లక్ష్మణ్ రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు మేం కలిసి పని చేస్తామని తెలిపారు. తెలంగాణ ప్రజల తరఫున యోగి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
లక్ష్మణ్, నేను ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం కృషి చేశాం. ఇవాళ మోదీ నాయకత్వంలో మరింత బాగా పనిచేస్తాం. తెలంగాణ తరఫున రాజ్యసభకు లక్ష్మణ్‌ను ఎంపిక చేసినందుకు యూపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు. తెలంగాణ ఏర్పడ్డాక భాజపా తరఫున మొట్టమొదటి సారిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. తెలంగాణలో భాజపాను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తాం.
- కిషన్ రెడ్డి, కేంద్రమంత్రి
ఇవీ చదవండి:
'అత్యాచారం కేసును సీబీఐకి అప్పగించాలి..' డీజీపీకి భాజపా నేతల విజ్ఞప్తి..