కార్పొరేట్ పాఠశాలల్లో అధిక ఫీజు వసూళ్లను అరికట్టాలని భాజపా రాష్ట్ర నాయకులు కళ్లెం రవీందర్ అన్నారు. జీవో నంబర్ 46ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్‌లోని ఎంఈవో కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను ప్రైవేట్ పాఠశాలలు పట్టించుకోవడం లేదని రంగారెడ్డి జిల్లా అర్బన్ భాజపా అధ్యక్షులు సామ రంగారెడ్డి ఆరోపించారు. నెల రోజుల పాటు జరిగిన క్లాసులకు ఏడాది ఫీజు వసూలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కార్పొరేట్ పాఠశాలల దోపిడిని అరికట్టడానికి జీవో నంబర్ 46ను పటిష్టంగా అమలు చేయాలని కోరుతూ.. ఎంఈవో ఈర్య నాయక్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక భాజపా కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: Bhatti Vikramarka: తెరాస ప్రభుత్వం ఎస్సీలను అణచివేస్తోంది: భట్టి