ETV Bharat / state

'రైతులకు ఇచ్చిన హామీ అమలులో ప్రభుత్వం విఫలం' - భాజపా నేతలు

పండించిన ప్రతి గింజను కొంటామని హామీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం... అమలులో విఫలమైందని భాజపా (Bjp) నేతలు శ్రీవర్ధన్ రెడ్డి, మిథున్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ ప్రభుత్వ వ్యవసాయ మార్కెట్ యార్డులో చేపట్టిన రైతు పరామర్శ యాత్రకు వారు హాజరయ్యారు.

Rangareddy District Shadnagar
Failure: 'రైతులకు ఇచ్చిన హామీ అమలులో ప్రభుత్వం విఫలం'
author img

By

Published : May 28, 2021, 10:18 PM IST

పండించిన ప్రతి గింజను కొంటామని హామీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం… హామీ అమలులో విఫలమైందని భాజపా (Bjp) నాయకులు శ్రీవర్ధన్ రెడ్డి, మిథున్ రెడ్డి ఆరోపించారు. కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి.వెంకటేశ్వర్ రెడ్డి, శివారెడ్డి ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ ప్రభుత్వ వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్వహించిన రైతు పరామర్శ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. రైతులకు గన్ని బ్యాగులు సరఫరా చేయడం, ధాన్యం కొనుగోలు విషయంలోనూ పూర్తిగా విఫలమైందని విమర్శించారు.

మార్కెట్​కు వచ్చిన రైతులకు కనీస అవసరాలు కల్పించడంలో పాలకులు విఫలమయ్యారని అన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి(Niranjan Reddy) వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అన్నదాతల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో శనివారం భాజపా ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. పార్టీ నియోజకవర్గ బాధ్యడు దేపల్లి అశోక్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ ఛైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇదీ చూడండి: BC Reservations : రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు మరో పదేళ్ల పాటు పొడిగింపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.