ETV Bharat / state

మున్సిపాలిటీలో నిధుల దుర్వినియోగం.. కౌన్సిలర్ల ధర్నా

author img

By

Published : Nov 11, 2020, 6:26 PM IST

ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో భారీగా నిధుల దుర్వినియోగం జరిగిందని ఆరోపిస్తూ భాజపా కౌన్సిలర్లు, నాయకుల ధర్నా చేపట్టారు. ఒకే పనికి రెండు బిల్లు పెట్టారంటూ మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.

bjp-councilors-protest-in-front-of-ibrahimpatnam-municipal-office-in-rangareddy-district
మున్సిపాలిటీలో నిధుల దుర్వినియోగం.. కౌన్సిలర్ల ధర్నా

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో దాదాపు రూ. 3 కోట్ల నిధుల దుర్వినియోగం జరిగిందని ఆరోపిస్తూ కౌన్సిలర్లు ధర్నా నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కౌన్సిలర్లు భాస్కర్, సత్యనారాయణ, నాయకులు మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. మున్సిపాలిటీ ఛైర్ పర్సన్ కప్పరి స్రవంతి, కమిషనర్ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు.

కోట్ల రూపాయల నిధులను ఎలాంటి ఎజెండా తీర్మానాలు లేకుండా కేటాయించారని, ఒకే పనికి అనేక సార్లు బిల్లులు ఇచ్చారని,టెండర్లకు ఇచ్చే పనులను విభజించి నిధుల స్వాహా చేస్తున్నారని భాజపా ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బాషా విమర్శించారు. ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నిధుల దుర్వినియోగంపై జిల్లా పాలనాధికారికి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్​రెడ్డికి విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి కుంభకోణంపై భాజపా ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నిస్తుందన్నారు.

ఇదీ చూడండి: సన్నాల అవస్థ: 'వందల మందిలో 50మందికే టోకెన్లు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.