చాలా మంది నిరుపేద నిరుద్యోగులకు ఉద్యోగాల కోసం హైదరాబాద్లోని శిక్షణా కేంద్రాల్లో చేరేందుకు ఆర్థిక స్తోమత లేదని... జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి అన్నారు. అలాంటి వారికి భోజన సౌకర్యంతో పాటు శిక్షణను అందించాలనే ఉద్దేశంతోనే ఉచిత శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లోని అయ్యప్ప కొండపై పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు నివాళులు అర్పించారు.

సద్వినియోగం చేసుకోవాలి...
అనంతరం ఆయన సహకారంతో నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ కేంద్రాన్ని జాతీయ ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు రాములుతో కలిసి ఆచారి ప్రారంభించారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని నిరుద్యోగ అభ్యర్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. శిక్షణకు వచ్చే వారికి రవాణా సౌకర్యం అందిస్తామని పేర్కొన్నారు.
అంబేడ్కర్ స్ఫూర్తితో...
విద్యార్థులు అంకిత భావంతో ఉద్యోగాల కోసం ప్రయత్నించాలని... జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు రాములు తెలిపారు. రాజ్యాంత నిర్మాత అంబెడ్కర్ అంటరాని తనాన్ని అధిగమించి విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించారని గుర్తుచేశారు. రాజ్యాంగాన్ని రచించి అందరి జీవితాల్లో వెలుగు నింపిన ఆయనను ఆదర్శంగా తీసుకుని ఉద్యోగాల కోసం ప్రయత్నించాలని అన్నారు.
ఇదీ చదవండి: సవాళ్లు, ప్రతి సవాళ్లతో వేడెక్కిన నాగార్జునసాగర్