మూడు రోజుల పాటు జరగనున్న గరిగుట్ట పెద్దమ్మ జాతర ఉత్సవాల ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. జాతర ఏర్పాట్లను జల్పల్లి కౌన్సిలర్ బుడమల యాదగిరి, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు. పురపాలిక ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు చేపడుతున్నారు.
రంగారెడ్డి జిల్లా జల్పల్లి-మాదన్నగూడ అటవీప్రాంతంలో ఈనెల 6,7,8 తేదీల్లో ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ జాతరకు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల నుంచి భక్తులు భారీగా హాజరవుతారు. అమ్మవారి దేవాలయం అటవీప్రాంతంలో ఉండడం వల్ల అటవీ అధికారుల సహకారంతో జాతరను అత్యంత వైభవంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు.