అమీన్పూర్ మారుతి హోమ్ అనుమతిని రద్దు చేశామని మహిళాభివృద్ది శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్య తెలిపారు. అందులో ఉన్న పిల్లలను ప్రభుత్వ హోమ్‌లకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రైవేట్ హోమ్‌లపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని ఆమె చెప్పారు.
జిల్లా పర్యవేక్షణ కమిటీ తరచూ సందర్శించి ప్రైవేట్ హోమ్‌లను పర్యవేక్షిస్తున్నారని అన్నారు. ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం దురదృష్టకరమన్నారు. ఘటనలో ఇప్పటికే మూడు కేసులు నమోదయ్యాయని, ఓ హై పవర్ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. విచారణ చేసి ఈనెల 20లోపు నివేదిక ఇవ్వాలని సూచించినట్లు కమిషనర్ తెలిపారు. బాలిక పొస్ట్‌మార్టం రిపోర్ట్ వస్తే.. మృతికి గల కారణాలు పూర్తిగా తెలుస్తాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 429 ప్రైవేట్ హోమ్స్‌లో 13 వేల మందికి పైగా పిల్లలున్నారని, ప్రతి ఒక్కరి సంరక్షణ విషయంలో జాగ్రత్త వహిస్తామని ఆమె వివరించారు.
ఇదీ చూడండి : ఎస్సారెస్పీ కాలువకు గండి... యుద్ధప్రాతిపదికన మరమ్మతులు