సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం చేయాలని అన్నదాతలకు అక్కినేని అమల సూచించారు. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పాపిరెడ్డిగూడలో 650 మంది రైతులకు ఉచితంగా కంది విత్తనాలు పంపిణీ చేశారు. ఒక్కో రైతుకు 4 కిలోల కంది విత్తనాలు అందజేశారు. కరోనా వంటి క్లిష్ట సమయంలో ప్రజలంతా ఒకరికి ఒకరు తోడుండాలని సూచించారు.
అన్నదాతలు ఆసక్తితో ముందుకు వస్తే నిపుణులైన వ్యవసాయ రంగ శాస్త్రవేత్తలను పిలిపించి అవగాహన కల్పిస్తామని అక్కినేని అమల హామీ ఇచ్చారు. గ్రామ సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు.
- ఇదీ చూడండి అతడే ఒక సైన్యంగా కరోనాతో పోరు!