Abvp Protest: సరూర్‌నగర్ హత్య కేసు నిందితులను కఠినంగా శిక్షించాలంటూ... ఏబీవీపీ నాయకులు పలుచోట్ల ఆందోళనకు చేశారు. మృతుడు నాగరాజు కుటుంబాన్ని ఆదుకుని అశ్రిన్‌కు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. హత్యకేసులో నిందితులను శిక్షించాలంటూ... హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లో ఏబీవీపీ కార్యకర్తలు నిరసన ర్యాలీ చేశారు. రోడ్డుపై బైఠాయించారు. మాసబ్‌ట్యాంక్ చౌరస్తా వద్ద నాగరాజు చిత్రపటానికి ఏబీవీపీ కార్యకర్తలు పూలమాల వేసి నివాళులర్పించారు.
కూకట్‌పల్లి బస్‌స్టాప్ వద్ద ఏబీవీపీ శ్రేణులు ఆందోళకు దిగారు. నాగరాజు హత్యకేసులో నిందితులను శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోనూ భాజపా శ్రేణులు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నాగరాజు కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఇవీ చదవండి: