Abdullapurmet Naveen Murder Case Latest Updates: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నవీన్ హత్య కేసులో ప్రధాన నిందితుడు హరిహరకృష్ణ స్నేహితురాలైన నిహారిక రెడ్డి జైలు నుంచి విడుదలైంది. ఈ కేసులో ఏ3గా ఉన్న నిహారికకు శనివారం రంగారెడ్డి జిల్లా ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆదివారం ఆమె చర్లపల్లి జైలు నుంచి విడుదలైంది.
అసలు ఏం జరిగిందంటే.: నిహారిక ప్రేమ కోసం హరికృష్ణ తన స్నేహితుడైన నవీన్‌ను అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ హత్యలో ప్రధాన నిందితుడు హరికృష్ణ అరెస్టు అయిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో హరికృష్ణకు సహకరించిన అతని స్నేహితులు హసన్(ఏ2), నిహారిక(ఏ3)లను పోలీసులు నిందితులుగా చేర్చి అరెస్టు చేశారు. నవీన్‌ను హత్య చేసిన విషయం హరికృష్ణ ఆ ఇద్దరికి చెప్పినా ఎక్కడా నిజం బయటపెట్టకుండా.. హత్య గురించి ఎవ్వరికీ సమాచారం ఇవ్వకుండా ఉన్నారు. దీంతో పాటు హరికృష్ణకు, నిహారికకు మధ్య జరిగిన ఫోన్ సంభాషణలు, మెసేజ్‌లను తొలగించి సాక్ష్యాలను తొలగించే ప్రయత్నం చేసినందుకు పోలీసులు ఆమెను నిందితురాలిగా పరిగణించి అరెస్టు చేశారు. ఏ2, ఏ3లుగా ఉన్న హసన్, నిహారికలను పోలీసులు హయత్‌నగర్ కోర్టులో హాజరు పరిచారు. న్యాయమూర్తి వీరికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. అయితే ఈ మధ్య నిహారిక బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుంది. నిహారికకు రంగారెడ్డి జిల్లా ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో నేడు చర్లపల్లి జైలు నుంచి విడుదలైంది.
'హత్య కథా చిత్రమ్' ఇలా జరిగింది..: ఫిబ్రవరి 17న నవీన్‌ను హరికృష్ణ అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతానికి తీసుకెళ్లి ఘోరంగా హత్య చేశాడు. నవీన్ శరీరం నుంచి తల, గుండె, చేతి వేళ్లు, మర్మాంగాలను తీసి వాటిని తన స్నేహితుడైన హసన్ సహాయంతో మన్నెగుడ ప్రాంతంలో పడేశాడు. తర్వాత హరికృష్ణ హసన్ ఇంటికి వెళ్లి ఆ రోజు రాత్రి అక్కడే ఉన్నాడు. మరుసటి రోజు ఉదయం బీఎన్ రెడ్డి నగర్‌లో ఉన్న నిహారిక ఇంటికి వెళ్లి నవీన్‌ను హత్య చేసిన విషయం చెప్పాడు. ఆమె దగ్గర ఖర్చుల కోసం రూ.1500 తీసుకొని వెళ్లిపోయాడు. అప్పటి నుంచి హరికృష్ణ తన స్నేహితులైన హసన్, నిహారికలతో ఫోన్లో టచ్‌లో ఉన్నాడు. ఫిబ్రవరి 20న సాయంత్రం నిహారిక దగ్గరకు వెళ్లి ఆమెను బైక్‌పై ఎక్కించుకుని నవీన్‌ను చంపిన ప్రదేశానికి తీసుకెళ్లి చూపించాడు.
ఫిబ్రవరి 21న నవీన్ కుటుంబసభ్యులు హరికృష్ణకు ఫోన్ చేయడం ప్రారంభించారు. దీంతో హత్య విషయం బయటపడుతుందనే భయంతో హరికృష్ణ పారిపోయాడు. 24న తను హైదరాబాద్ వచ్చి.. హసన్ సహాయంతో నవీన్ శరీర భాగాలను తీసుకొచ్చి తగులబెట్టారు. అదే రోజు సాయంత్రం అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ విధంగా ఈ హత్య గురించి తెలిసినా కూడా హసన్, నిహారికలు ఆ సమాచారాన్ని బయటపెట్టకుండా, హత్యకు సంబంధించిన ఆధారాలను తొలగించేందుకు, ఎవ్వరికీ దొరకకుండా ఉండేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు హరికృష్ణ స్నేహితులైన హసన్, నిహారికలను ఏ2, ఏ3లుగా చేర్చి వీరినీ కటకటాల్లోకి నెట్టారు.
ఇవీ చదవండి:
మీకు ఇది తెలుసా..? TSRTC టికెట్‌తో సులభంగా తిరుమల శ్రీవారి దర్శనం..
ప్రశ్నపత్రాలు ఎక్కడ ప్రింట్ అవుతున్నాయని విద్యార్థులు అడుగుతున్నారు: గవర్నర్