బొటిక్నే మాస్కుల తయారీ కేంద్రంగా మార్చారు. ఉచితంగా మాస్కులు పంపిణీ చేస్తున్నారు. ఈ ఆలోచన ఎలా వచ్చింది?
అందరికి మాస్కులు అందించాలనే ఉద్దేశంతో మాస్కుల తయారీ ప్రారంభించాం. పేదలకు, అనాథలకు మాస్కులు అందడం కష్టం. వారందరికీ ఉచితంగా ఇవ్వాలని మాస్కుల తయారీ మొదలు పెట్టాము. ఇప్పటివరకు 5వేల మాస్కులు పంపిణీ చేశాం.
మాస్కుల పంపిణీ ఎలా చేస్తున్నారు. ఇందుకోసం ఏమైనా బృందాన్ని ఏర్పాటు చేశారా?
మాకు గండిపేట్ వెల్ఫేర్ సొసైటీ అనే ఎన్జీవో ఉంది. దాని ద్వారా పంపిణీ చేస్తున్నాం. అలాగే స్థానిక కార్పొరేటర్లు, పోలీసుల ద్వారా పంపిణీ చేస్తున్నాం.
క్లాత్ మాస్కులు తయారు చేయడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి?
అందరికి ఎన్95 మాస్కులు దొరకడం కష్టం. వినియోగం పెరగడం వల్ల ఎవరికి అవసరమో వారికి దొరకడం లేదు. ఇది కాటన్‌తో తయారు చేస్తున్నాం. దీన్ని శుభ్రపరచడం సులభం. ఉతికిన 20నిమిషాల్లోనే ఎండిపోతుంది.
రోజుకు ఎన్ని మాస్కులు తయారు చేస్తున్నారు?
రోజుకు 600మాస్కులు తయారు చేస్తున్నాము. వర్కర్లు భౌతిక దూరం పాటిస్తూ పని చేస్తున్నారు. బస్తీల్లో ఎక్కువగా పంచుతున్నాము. ఎందుకంటే అక్కడ వైరస్ వ్యాప్తి అయితే అరికట్టడం కష్టం.
ఇదీ చూడండి: గాంధీభవన్‌లో కాంగ్రెస్ టాస్క్‌ఫోర్స్ కమిటీ భేటీ