A 40 year old man raped a 4 year-old girl హైదరాబాద్ నగరంలో మరో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఓ వ్యక్తి నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే...
shamshabad Girl Rape Incident నాలుగేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచారం చేశాడు. ఈ ఘటన శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై శంషాబాద్ డీసీపీ భాస్కర్ గౌడ్ వివరాల ప్రకారం... నాలుగేళ్ల చిన్నారిపై ఓ కామాందుడు విచక్షణ కోల్పోయి అత్యాచారం చేశాడు. నిందితుడు వెంకటయ్య మహబూబ్‌నగర్‌కు చెందినవాడు. ఈయన వయస్సు 40 సంవత్సరాలు. పొట్టకూటి కోసం ఇతను హైదరాబాద్‌కు వచ్చాడు. గత కొంతకాలంగా శంషాబాద్‌లో ఫ్లైఓవర్ నిర్మాణం (వీడీపీ) ప్రైవేట్ లేబర్ కంపెనీలో కార్మికుడిగా పనిచేస్తూ ఉన్నాడు. అక్కడ పనిచేసే లేబర్ కూలీలు అందరూ శంషాబాద్‌లోని తహసీల్దారు కార్యాలయం ముందు గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారు. వెంకటయ్య కూడా ఆ ప్రాంతంలోనే ఒక గుడిసె వేసుకొని నివసిస్తున్నాడు.
నిందితుడు వెంకటయ్యకు మద్యం తాగే అలవాటు ఉంది. ఆదివారం రాత్రి అతను పీకల దాకా మద్యం సేవించి తన నివాస ప్రాంతంలోకి వచ్చాడు. మద్యం మత్తులో కళ్లు మూసుకుపోయిన వెంకటయ్య వాళ్ల గుడిసెల పక్కనే ఉన్న నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం చేశాడు. చిన్నారి బాధతో కేకలు వేసింది. ఆ కేకలను గమనించిన చిన్నారి తల్లి వెంటనే వచ్చి నిందితుడిని పట్టుకుని చితకబాదింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి వారికి పట్టించింది. చిన్నారి ఆరోగ్యం దెబ్బతినడం వల్ల వెంటనే హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రికి తరలించి... చికిత్స అందిస్తున్నారు. చిన్నారి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని నిందితుడు వెంకటయ్యను అరెస్టు చేసి రిమాండుకు తరలించాం' అని పోలీసులు పేర్కొన్నారు. అయితే చిన్నారి తల్లిదండ్రులు కర్ణాటకకు చెందినవారు. బతుకుదెరువు కోసం వారు హైదరాబాద్‌కు వలస వచ్చారని పోలీసులు తెలిపారు.
మెరుగుపడుతున్న చిన్నారి ఆరోగ్యం... నాలుగేళ్ల చిన్నారి నీలోఫర్ ఆస్పత్రిలో చిన్న పిల్లల వైద్య నిపుణుల ఆధ్వర్యంలో చికిత్స పొందుతోంది. ఇప్పుడు చిన్నారి ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని నీలోఫర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ ఉషారాణి తెలిపారు. చిన్నారి పూర్తిగా కోలుకున్నాక ఆమెకు మానసిక నిపుణులతోనూ చికిత్స చేయిస్తామని ఆమె తెలిపారు.
ఇక ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా... పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా.. విచక్షణ కోల్పోయి కొంత మంది ఇలాంటి దారుణాలకు ఒడిగడుతున్నారు. ఆరు నెలల పసిపాప నుంచి 80ఏళ్ల వృద్ధులపై కూడా ఇలాంటి దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటివి అరికట్టాలంటే.. చట్టాలు కఠినతరం చేయాలి. వ్యక్తి ఆలోచనలో కూడా మార్పు రావాలి.
ఇవీ చదవండి: