6 Years Boy Death in Rangareddy : రంగారెడ్డి జిల్లాలో ఓ బాలుడు ఇంటి నుంచి బయటకి వచ్చి.. దుకాణానికి వెళ్దామని బయల్దేరాడు. ఆ బాలుడి తల్లిదండ్రులు బయట కాసేపు ఆడుకుని వచ్చేస్తాడులే అని అనుకున్నారు. కానీ వారు అనుకున్నది జరగలేదు. ఎంత సేపైనా.. కుమారుడు ఇంటికి రాలేదు. దీంతో కంగారు పడిన తల్లిదండ్రులు చుట్టు పక్కల ప్రదేశాలని వెతికారు. ఎంతకీ బాలుడు ఆచూకీ లభించలేదు. మరింత ఒత్తిడికి గురై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చివరికి పోలీసులు రంగంలోకి దిగాక బాలుడి గురించి భరించలేని విషయం తెలిసింది. ఆ బాలుడికి ఏమైంది ? పోలీసులు ఎలాంటి పరిస్థితుల్లో ఆచూకీ తెలుసుకున్నారు ? ఇంతకీ బాలుడు బతికే ఉన్నాడా ? చనిపోయాడా ? ఏ స్థితిలో పోలీసులు బాలుడిని గుర్తించారో ఇప్పుడు చూద్దాం.
Child Death at Narsinghi : పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లాలో నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరేళ్ల బాలుడు బన్ని మంగళ వారం సాయంత్రం ఇంటి నుంచి కిరాణా దుకాణానికి వెళ్లాడు. ఎంత సేపైనా తిరిగి ఇంటికి రాకపోడంతో ఆ బాలుడి కుటుంబ సభ్యులు ఒత్తిడికి గురై చుట్టు పక్కల ప్రాంతం అంతా వెతికారు. బాలుడి జాడ లభించకపోవడంతో బుధవారం ఉదయం నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వెంటనే స్థానిక పోలీసులు రంగంలోకి దిగి.. గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో వారి ఇంటికి సమీపంలో ఉన్న పురాతన బావిలో బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సాయంతో బాలుడి మృతదేహాన్ని బయటకు తీశారు. విగత జీవిగా మారిన బాలుడి మృతదేహాన్ని(Child Death) చూస్తూ.. కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. అనంతరం బన్నీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా వైద్యశాలకు తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు(Child Death Case) చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదవశాత్తు బాలుడు ఆడుకుంటూ వెళ్లి.. బావిలో పడి చనిపోయి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు.
Boy Died in Hyderabad: మొన్న మౌనిక.. నేడు వివేక్.. బాలుడి ప్రాణం తీసిన నీటి గుంత
Educators Suggestions for Parents : చిన్నపిల్లలను బాల్యదశలో జాగ్రత్తగా చూసుకోవాలని.. వారికి తెలియకుండా ప్రమాదాల్లో పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని విద్యావేత్తలు చెబుతున్నారు. చిన్న వయస్సులో పిల్లలు ప్రతి విషయానికి ఎక్కువగా ఆకర్షితులు అవుతారని.. దాని వల్ల వారికి తెలియకుండానే అపాయంలో చిక్కుకుంటారని తెలిపారు. ఆ వయస్సులో కుటుంబ సభ్యల సంరక్షణలో ఉండాలని.. లేని పక్షంలో ఇబ్బందులు పడతారని.. ఒక్కోసారి మృతి చెందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. చిన్న పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటే.. భవిష్యత్తులో ఎన్నో విజయాలు సాధించే అవకాశం ఉందని.. వారిని ప్రతి క్షణం జాగ్రత్తగా చూసుకోవాలని నిపుణులు(Experts Suggestions) చెబుతున్నారు.
నోట్లో బల్లి పడి రెండున్నరేళ్ల బాలుడు మృతి.. భార్య, మేనల్లుడిని కాల్చి చంపిన పోలీస్!
బోరుబావిలో పడ్డ చిన్నారి మృతి.. కాపాడేందుకు 55 గంటలు శ్రమించినా..