ETV Bharat / state

money bag on road : రోడ్డుపై రూ.6.3లక్షల బ్యాగు.. నిజాయితీని చాటుకున్న కార్మికుడు - రంగారెడ్డి జిల్లా వార్తలు

హైదరాబాద్​ కాటేదాన్​లో ఓ వ్యక్తి తన నిజాయితీని చాటుకున్నాడు. రోడ్డుపై దొరికిన(money bag on road) రూ.6.3లక్షలను పోలీసులకు అప్పగించాడు. ఈ ఘటన సైబరాబాద్‌ కమిషనరేట్ పరిధిలో చోటుచేసుకుంది.

money bag on road
money bag on road
author img

By

Published : Nov 28, 2021, 10:28 AM IST

రోడ్డుపై దొరికిన డబ్బును ఓ వ్యక్తి పోలీసులకు అప్పగించి తన నిజాయితీని చాటుకున్నాడు. రణవీర్‌ సింగ్‌(41) హైదరాబాద్ కాటేదాన్‌లోని(katendar money bag news) పోషక్‌ఫుడ్‌ పరిశ్రమలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం రోజు యజమానికి చెందిన మరో పరిశ్రమలో ఇవ్వడానికి రూ. 6.3లక్షల నగదుతో ఉన్న బ్యాగును బండిపై పెట్టుకుని బయలుదేరాడు. మార్గం మధ్యలో సంచి పడిపోయినా గుర్తించకుండా వెళ్లిపోయాడు. కాలినడకన వస్తున్న పాలిమర్‌ కంపెనీలో పనిచేసే కార్మికుడు అశోక్‌ తివారి(29)కి ఆ బ్యాగ్‌ కనిపించింది. తెరచి చూడగా నగదు ఉంది. ఆ సంచిని తన యజమాని రణబీర్‌కు అప్పగించాడు.

రణబీర్‌ వెంటనే అశోక్‌ను వెంటబెట్టుకుని నేరుగా మైలార్‌దేవుపల్లి ఠాణాకు(money bag on road handed over to police) వచ్చాడు. అదే సమయంలో నగదు పోగొట్టుకున్న రణవీర్‌ ఫిర్యాదు చేయడానికి వచ్చాడు. సైబరాబాద్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర ఠాణా పరిశీలనకు వచ్చారు. బ్యాగును పోగొట్టుకున్న రణవీర్‌కు నగదు అందించిన రణబీర్‌, అశోక్‌లను కమిషనర్‌ అభినందించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.