ETV Bharat / state

ప్రయాణికుల్లేక 40 శాతం బస్సులు రద్దు - ప్రయాణికుల్లేక 40 శాతం బస్సులు రద్దు

విశ్రాంతి ఎరుగని భాగ్యనగర రహదారులన్నీ.. కరోనా ఉద్ధృతి వాతావరణానికి బోసిపోయి కనిపిస్తున్నాయి. రాత్రే కాదు.. పగలూ కర్ఫ్యూ వాతావరణం తలపిస్తోంది. చాలావరకు ప్రజలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. కొనేవాళ్లు లేక దుకాణాదారులు.. తిరిగే వారు లేక ఆర్టీసీ సిటీ బస్సులు.. ఆఖరుకు దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లూ ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. దీంతో నగరంలోని సగానికి సగం దుకాణాలు మూత పడుతుండగా.. ఆర్టీసీ బస్సులు 40 శాతం వరకూ రద్దవుతున్నాయి. దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లను కూడా నిలిపేశారు. నిత్యం రద్దీగా ఉండే సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ముందు ఆర్టీసీ బస్సులు ఖాళీగా కనిపిస్తున్నాయి.

no passengers
rtc
author img

By

Published : May 1, 2021, 11:24 AM IST

కరోనా కష్టకాలంలో రవాణా సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఆర్టీసీ బస్సులను నడుపుతున్నారు. కొన్ని రోజులుగా బస్సులో నలుగురైదుగురు మించి ప్రయాణికులు ఉండటం లేదు. దీంతో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 4 మధ్య దాదాపు 40 శాతం బస్సులను సంస్థ రద్దు చేస్తోంది. కరోనాకు ముందు 33 లక్షలుండే ప్రయాణికులు.. ఇప్పుడు 8 లక్షలు దాటడం లేదని అధికారులు చెబుతున్నారు. ఇంధన డబ్బులు కూడా రాని పరిస్థితుల్లో కొన్నింటిని తగ్గిస్తున్నామంటున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులు కూడా 30 శాతం వరకూ రద్దయ్యాయని రంగారెడ్డి రీజియన్‌ అధికారులు చెబుతున్నారు. నగరం నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ఇటీవల 10 వరకు రద్దు చేస్తే.. ముంబయికి రాకపోకలు సాగిస్తున్న ఆరు రైళ్లను గురువారం రద్దు చేశారు. పరిస్థితులు సాధారణ స్థితికి రావడంతో ఏప్రిల్‌ 1 నుంచి 20 రైళ్లను పునరుద్ధరించి మొత్తం 70 శాతం రైళ్లను నడుపుతుండగా.. నెలాఖరు నాటికి రద్దు చేసుకోవాల్సిన దుస్థితి.

ఆటోలు.. క్యాబ్‌లదీ అదే పరిస్థితి

నగరంలో ఆటోలు 2.20 లక్షలుండగా.. క్యాబ్‌లు 70 వేల వరకూ ఉండేవి. కరోనా మొదటి వేవ్‌తో చాలా మంది కుదేలవ్వగా.. రెండో వేవ్‌ వారిని రోడ్డు ఎక్కనీయడం లేదు. రాత్రి పూట వచ్చే బస్సులు, రైళ్లు కూడా తగ్గిపోవడంతో.. ఆటోలకు గిరాకీ లేకుండా పోయింది. నిర్మానుష్యంగా మారిన రహదారుల్లో, కాలనీల్లో.. అంబులెన్సులు మౌనంగా వెళ్లి అవసరమైన వారికి సేవలందిస్తున్నాయి. వీధుల్లోనూ సందడి తగ్గింది.

ఇదీ చూడండి: కరోనా బాధితులా.. ఆదుకొనే ఆసుపత్రులివే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.