రంగారెడ్డి జిల్లా ఆమనగల్ పురపాలికల పరిధిలో విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. దసరా పండగ సెలవుల్లో ఇచ్చిన హోమ్‌వర్క్ చేయనందున ఉపాధ్యాయులు మందలించారు. తీవ్ర మనస్తాపం చెందిన విద్యార్థి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకుని బలవన్మరనానికి పాల్పడ్డాడు. చుట్టుపక్కల వారు గమనించి బాలున్ని కల్వకుర్తి ప్రభుత్వ తరలించగా... అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధరించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. తల్లిదండ్రుల రోదనలు అక్కడున్న వారిని కంటతడి పెట్టించాయి.
ఇవీచూడండి: వాతావరణశాఖ హెచ్చరిక... నాలుగు రోజులపాటు వర్ష సూచన