ETV Bharat / state

YS SHARMILA: గొల్లపల్లిలో వైఎస్ షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష - తెలంగాణ వార్తలు

రాజన్న సిరిసిల్ల జిల్లా గొల్లపల్లిలో వైతెపా(YSRTP) అధ్యక్షురాలు షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టారు. తొలుత ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగ యువకుడు మహేందర్ యాదవ్ కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. అండగా ఉంటానని హామీ ఇచ్చి... అనంతరం దీక్ష ప్రారంభించారు.

ysrtp Sharmila deeksha, sharmila unemployment deeksha
వైతెపా షర్మిల దీక్ష, గొల్లపల్లిలో షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష
author img

By

Published : Aug 3, 2021, 12:44 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా గొల్లపల్లిలో వైతెపా(YSRTP) అధ్యక్షురాలు షర్మిల(YS SHARMILA) నిరుద్యోగ నిరాహార దీక్ష ప్రారంభించారు. వేములవాడ నియోజకవర్గంలోని కోనరావుపేట మండలం గొల్లపల్లి గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగ యువకుడు మహేందర్ యాదవ్ కుటుంబాన్ని పరామర్శించారు. మహేందర్ బలవన్మరణానికి గల కారణాలను కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు. అధైర్యపడొద్దు... ధైర్యంగా ఉండాలని మనోధైర్యాన్నిచ్చారు. అండగా ఉంటామని హామీ ఇచ్చి... ఆర్థిక సాయం అందజేశారు.

అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరం వద్దకు చేరుకొని... నిరుద్యోగ దీక్షలో పాల్గొన్నారు. ఉద్యోగాలకు ప్రకటన జారీ చేయాలంటూ.. ఆమె నిరాహార దీక్ష చేపట్టారు. 'నా చావుకు కారణం నిరుద్యోగం' అంటూ ఓ యువకుడు జమ్మికుంట రైల్వే స్టేషన్​ సమీపంలో ఆత్మహత్యకు పాల్పడిన విషయాన్ని ట్విట్టర్ వేదికగా ఆమె ప్రజల దృష్టికి తీసుకొచ్చారు.

ప్రతి మంగళవారం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష వారం చేపడతానని షర్మిల వనపర్తి జిల్లా తాడిపత్రి పర్యటనలో చెప్పారు. ప్రభుత్వ శాఖల్లో లక్షా 90 వేల వరకు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఆ పర్యటనలో తెలిపారు. వాటిని భర్తీ చేయాలనే డిమాండ్​తో ప్రతివారం ఒక్కో జిల్లాలో దీక్ష చేపడుతున్నారు. ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగుల కుటుంబాలను పరామర్శిస్తూ దీక్ష చేపడుతున్నారు. ఖమ్మం జిల్లా పెనుబల్లిలో ఈ దీక్ష చేపట్టారు. అనంతరం నల్గొండ జిల్లా పుల్లెంలలో షర్మిల(YS SHARMILA) నిరాహార దీక్ష చేపట్టారు. ఈ వారం గొల్లపల్లిలో దీక్ష చేస్తున్నారు.

ఇదీ చదవండి: Minister puvvada: సైకిల్​పై మంత్రి పువ్వాడ.. ఖమ్మం వీధుల్లో పర్యటన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.