మధ్య మానేరు వల్ల తాము సర్వస్వం కోల్పోయామని... పూర్తిస్థాయిలో పరిహారం అందించాలని వాటర్ ట్యాంక్ ఎక్కి నిర్వాసితులు నిరసన చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం చీర్లవంచ ఆర్అండ్ఆర్ కాలనీలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అగ్రహారంలో పెళ్లి వేడుకలకు మంత్రి కేటీఆర్ హాజరవుతున్నారనే సమాచారంతో మహిళలు నీటి ట్యాంక్ ఎక్కి మంత్రి రావాలని డిమాండ్ చేశారు.
ఆందోళనకారులకు స్థానికులు మద్దతు ఇచ్చారు. సంఘటనా స్థలానికి జిల్లా అదనపు కలెక్టర్ అంజయ్య, పోలీస్, రెవెన్యూ అధికారులు వచ్చి వారి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ముంపు సమస్యలను స్థానికులు ఆయనకు వివరించారు.
ఇదీ చదవండి: గోవధ నిషేధం బిల్లుకు కర్ణాటక అసెంబ్లీ ఆమోదం