రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేటలో ఓ యువతి వాటర్‌ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపింది. మండలంలోని నిజామాబాద్ గ్రామానికి చెందిన సుశీల... తనకు వారసత్వంగా రావాల్సిన భూమిని రెవెన్యూ అధికారులు తన పేరిట పట్టా చేయడం లేదంటూ నిరసన చేపట్టింది. గత కొన్నేళ్లుగా రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరిగినా... అధికారుల కాళ్ళు పట్టుకున్నా... తమను పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తమ భూమి పట్టా చేసేంతవరకు టవర్ దిగనంటూ పట్టుబట్టగా... పలువురు నాయకులు సుశీలకు నచ్చజెప్పి నిరసన విరమింపజేశారు.
భూమి పట్టా చేయాలంటూ వాటర్‌ట్యాంక్ ఎక్కి యువతి నిరసన - wpmen protest on water tank
వారసత్వంగా వచ్చిన భూమిని తన పేరు మీద పట్టా చేయాలంటూ ఓ యువతి వాటర్‌ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపింది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఏళ్లుగా అధికారుల చుట్టూ తిరిగినా.. కాళ్లు పట్టుకున్నా పట్టించుకోవటం లేదని బాధిత మహిళ గోడు వెళ్లబోసుకుంది.