ETV Bharat / state

'మధ్యమానేరు ముంపు బాధితుల సమస్యలు చట్టసభల్లో ప్రస్తావిస్తాం' - రాజన్నసిరిసిల్ల జిల్లా వార్తలు

మధ్యమానేరు ముంపు బాధితుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ నాయకుల ఆందోళన కారణంగానే పరిహారం ఇవ్వడం లేదని ప్రభుత్వం సాకులు చెబుతోందని.. అందువల్ల డిసెంబర్​ 31 వరకు ఆందోళనను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.

congress on mid maner
'మధ్యమానేరు ముంపు బాధితుల సమస్యలు చట్టసభల్లో ప్రస్తావిస్తాం'
author img

By

Published : Nov 16, 2020, 10:28 PM IST

కాళేశ్వరం ప్రాజెక్టుతో కొత్తగా ఒక్క ఎకరానికి కూడా నీరు ఇవ్వలేదని.. భూములు కోల్పోయిన వారికి పరిహారం కూడా దక్కలేదని సీఎల్పీనేత భట్టి విక్రమార్క విమర్శించారు. మధ్యమానేరు ప్రాజెక్టు నిర్మాణంతో భూములు కోల్పోయిన బాధితులతో రాజన్నసిరిసిల్ల జిల్లా కొడిముంజ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖాముఖి నిర్వహించారు.

పరిహారం రాకపోవడం వల్ల తాము పడుతున్న ఇబ్బందులను బాధితులు నేతలకు వివరించారు. 18 ఏళ్ల వయస్సు ఉన్న వారికి ప్యాకేజీ ఇవ్వాలన్న ఆందోళనను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకుల ఆందోళన కారణంగానే పరిహారం ఇవ్వడం లేదని సాకులు చెబుతున్నారని.. అందువల్ల డిసెంబర్​ 31 వరకు ఆందోళనను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.

మధ్యమానేరు ముంపు బాధితులు ఎదుర్కొంటున్న సమస్యలను చట్టసభల్లో లేవనెత్తుతామని భట్టి, జీవన్​రెడ్డి బాధితులకు హామీ ఇచ్చారు. ఇదే ప్రాంతానికి చెందిన ఎంపీ జోగినిపల్లి సంతోష్‌కుమార్‌ అడవులను దత్తత తీసుకునే కంటే.. ముంపు బాధితుల గ్రామాలను దత్తత తీసుకోవాలని జీవన్‌రెడ్డి సలహా ఇచ్చారు.

తెలంగాణ వస్తే ప్రజల జీవితాల్లో మార్పు వస్తుందని ప్రజలు ఆశించారని.. కేవలం కేసీఆర్‌ కుటుంబ సభ్యుల జీవితాల్లో మాత్రమే మార్పు వచ్చిందని భట్టి విక్రమార్క ఎద్దేశా చేశారు.

ఇవీచూడండి: 'కొండపోచమ్మ' పరిహారంపై గతంలో ఇచ్చిన స్టే కొనసాగుతుంది : సుప్రీం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.