రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ దేశంలో సుస్థిర సమాజ నిర్మాణానికి పునాదులు వేశారని ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్మార్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం అనంతపల్లిలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
అట్టడుగు వర్గాల ప్రజలకు హక్కులు కల్పించి, ఉన్నత వర్గాలతో కలిసుండే సుస్థిర సమాజం నిర్మించారని అన్నారు. నేటి భారతదేశ అభివృద్ధికి సుస్థిరతయే ప్రధాన కారణమన్నారు. ఎస్సీ విద్యార్థుల విదేశీ విద్యకు నిధులు కేటాయించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఎమ్మెల్యే సంకె రవిశంకర్ అన్నారు.
ఇదీ చదవండి: అంతర్రాష్ట్ర సర్వీసులపై నిర్ణయం ఆ తర్వాతే : కేసీఆర్