నిందితుడి ఇంటిని తగులబెట్టిన గ్రామస్థులు యువకుడిని హత్య చేసిన నిందితుల ఇంటిని గ్రామస్థులు తగులబెట్టిన ఘటన సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం నర్సింగాపూర్లో జరిగింది. గత నెల 8న హరీశ్ అనే వ్యక్తిని... అదే గ్రామానికి చెందిన రమేష్, శంకర్లు ఆస్తి తగాదాతో నరికి చంపి బావిలో పడేశారు. గ్రామస్థులు నిందితుల్ని పోలీసులకు అప్పగించారు.
తాజాగా నిన్న అర్థరాత్రి.. గ్రామస్థులు నిందితుడు రమేష్ ఇంటిపై పెట్రోల్ పోసి తగులబెట్టారు. ఫైరింజన్ వచ్చి మంటలు ఆర్పేలోపు పూర్తిగా కాలిపోయింది. ఇంట్లో ఎవరు లేకపోవడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. విచారణకు వచ్చిన పోలీసులతో గ్రామస్థులు వాగ్వాదానికి దిగారు.
ఈ పరిణామాలతో గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.