దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని కరోనా ప్రభావంతో మూసివేస్తున్నట్టు ఈవో కృష్ణవేణి ప్రకటించారు. నిత్యం పెద్ద సంఖ్యలో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు దర్శించుకునేందుకు వస్తుంటారు. కరోనా వైరస్ సోకకుండా ఇప్పటికే ఆలయంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు.
రాజన్న ఆలయాన్ని శుక్రవారం నుంచి పూర్తి స్థాయిలో ఆలయాన్ని మూసివేసేందుకు నిర్ణయించారు. స్వామివారికి జరిగే నిత్యపూజలు యథావిథిగా చేపట్టనున్నారు. భక్తులను మాత్రం ఆలయంలోకి అనుమతించరు. ఆలయం తెరిచే తేదీని దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తర్వాత ప్రకటిస్తామని తెలిపారు.
ఇదీ చూడండి: కరోనా భయంతో పెళ్లిల్లకు బంధుమిత్రుల దూరం