రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర ఆలయంలోకి భక్తులకు అనుమతి లేదని ఆలయ అధికారులు వెల్లడించారు. దేవాలయంలో ఈ నెల 18 నుంచి 22 వరకు... ఐదు రోజుల పాటు భక్తుల దర్శనం, కోడె మొక్కులు, ఇతర అన్ని రకాల మొక్కుబడి పూజలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ నెల 21న రాజన్న సన్నిధిలో జరగనున్న సీతారాముల కళ్యాణం, స్వామివారి నిత్య పూజలు, రథోత్సవం రద్దు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. భక్తులు పరోక్షంగా ఆన్లైన్ ద్వారా మొక్కుబడి పూజలు సమర్పించుకునే సదుపాయం కల్పించనున్నట్లు తెలిపారు. భక్తులు తెలంగాణ మీ సేవ లేదా టీ యాప్ ఫోలియో ద్వారా మొక్కుబడి రుసుము చెల్లిస్తే... వారి తరుఫున పరోక్షంలో పూజలు జరిపించనున్నట్లు వివరించారు.
ఇదీ చదవండి: ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా