రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావు పేట మండలం నర్మల శివారులోని ఎగువ మానేరు జలాశయం వరద నీటితో నిండింది. గత పది రోజులుగా కురుస్తున్న వర్షాలకు పాల్వంచ, కూడవెల్లి వాగుల నుంచి భారీగా చేరిన వరద నీటితో ఎగువ మానేరు జలాశయం నిండుకుండను తలపిస్తోంది. 31 అడుగుల నీటి నిల్వ సామర్థ్యం గల ఎగు మానేరు శుక్రవారం తెల్లవారుజాము సమయానికి 31 అడుగులకు కేవలం 15 ఇంచులు మాత్రమే తక్కువ ఉంది. వరద ప్రవాహం కొనసాగితే.. జలాశయం అలుగు దూకి.. మానేరు నది పారడం ఖాయం అంటున్నారు స్థానికులు. చాలా రోజుల తర్వాత సిరిసిల్లలో మానేరు పారనుంది అని సిరిసిల్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి: నాగార్జునసాగర్ 4 క్రస్ట్ గేట్లు ఎత్తిన అధికారులు