ETV Bharat / state

సిరిసిల్లలో ఊహించని అభివృద్ధి: కేటీఆర్​ - ktr

ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో సిరిసిల్లలో ఊహించని అభివృద్ధి జరిగిందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ అన్నారు. పింఛన్​ పెంపు హామీ నిలబెట్టుకున్నామని చెప్పారు.

కేటీఆర్​
author img

By

Published : Jul 20, 2019, 6:05 PM IST

ఎన్నికల్లో ఇచ్చిన ఆసరా పింఛన్ల పెంపు హామీని నిలబెట్టుకున్నామని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. సిరిసిల్లలో ఆసరా లబ్దిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. పింఛన్ల వయసు సడలింపు కూడా ఇవాల్టి నుంచే అమల్లోకి వస్తుందన్నారు. మండేపల్లిలో ఇప్పటికే 1320 రెండు పడకగదుల ఇళ్లు పూర్తి చేశామన్న కేటీఆర్... నమ్మకం లేకపోతే బస్సులు పెడతాం.. వెళ్లి చూడొచ్చన్నారు. ఆడ బిడ్డలకు వడ్డీ లేని రుణం కింద ఇవ్వాల్సిన 65 కోట్ల చెక్కులు త్వరలో అందచేస్తామని హామీ ఇచ్చారు.

సిరిసిల్లలో ఊహించని అభివృద్ధి: కేటీఆర్​

ఇదీ చూడండి:అన్నదాతకు అండగా... ప్రత్యామ్నాయాల దిశగా..

FILE:TG_KRN_01_20_KTR_ASARA_PENSIONS_3038228 FROM:MD.Aleemuddin,karimnagar Camera:Thirupathi Note:దీనికి సంబంధించిన ఫీడ్ త్రీజీ ద్వారా పంపించాను.. -------------------- ()() ఎన్నికల సందర్భంలో ఆసరా పింఛన్లు రెట్టింపు చేస్తామన్న హామీని నిలబెట్టుకున్నామని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు.సిరిసిల్లలో ఆసరా లబ్దిదారులకు ఆయన మంజూరు పత్రాలను అందజేశారు.ఇవాళ ఎంతో శుభదినమని...ఆసరా పింఛన్లు రెట్టింపు ఇవాళ నుంచి అమల్లోకి వచ్చిందని ఆయన పేర్కొన్నారు... ఆసరా పింఛన్ల వయసు సడలింపు కూడా ఇవ్వాల్టి నుంచి అమల్లోకి వస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు.ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు తోడు సిరిసిల్లలో ఊహించని అభివృద్ధి జరిగిందన్నారు.రెండుపడక గదుల ఇళ్లు మండేపల్లి లో ఇప్పటికే 1320 పూర్తి చేసామన్న కేటీఆర్ మీకు నమ్మకం లేకపోతే బస్సులు పెడతాం..మీరు స్వయంగా వెళ్లి చూడొచ్చని వివరించారు. ఎన్నికలు రాగానే డబ్బులు ఇస్తే ఇళ్ళు ఇస్తామని నమ్మబలికే వారుంటారని..వారిని ఎట్టి పరిస్థితిలో నమ్మొద్దని సూచించారు...కలెక్టర్ సమక్షంలో లాటరీ పద్ధతిన లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్నారు.ఇంటి జాగా ఉంటే 5 లక్షలు ఇస్తామని ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీకి సంబంధించిన ప్రాసెస్ కూడా త్వరలో మొదలవుతుందన్నారు. ఆడ బిడ్డలకు వడ్డీ లేని రుణం కింద ఇవ్వాల్సిన 65 కోట్ల చెక్కులు త్వరలో అందచేస్తామని హామీ ఇచ్చారు.సిరిసిల్ల పట్టనాని ఇతర పట్టణాల వాళ్ళు అసూయ పడే విధంగా అభివృద్ధి చేసుకున్నామని ఆయన పేర్కొన్నారు..ఇక భవిష్యత్తులో మున్సిపల్ చైర్మన్గా ఎవరు ఎన్నిక అయినా చేయడానికి పని లేకుండా అభివృద్ధి చేశామన్నారు...అంతే కాకుండా అప్పేరల్ పార్క్ లో పనులు వేగంగా సాగుతున్నాయి..దాని వల్ల మీ ఆదాయం మరింత పెరిగే ఆస్కారముందన్నారు.నాకు రాష్ట్ర,జాతీయ స్థాయిలో గుర్తింపువచ్చిందంటే..కేవలం నన్ను గెలిపించడంవల్లనే సాధ్యమైందని కేటీఆర్ గుర్తించారు.ఈ సందర్భంగా కేటీఆర్ పలువురికి ఆసరా పింఛన్లు మంజూరు పత్రాలు అందజేశారు..Byte Byte:కె.తారకరామారావు, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు..

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.