రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో కురిసిన భారీ వర్షానికి పలు గ్రామాల్లో పెద్ద మొత్తంలో పంట నష్టం జరిగింది. రుద్రంగి మండలం మానాలలో సుమారు రెండు వందల ఎకరాల్లో కోతకు సిద్ధంగా ఉన్న వరి పూర్తిగా నీట మునిగింది. భారీ వర్షంతో వాగులన్నీ పొంగిపొర్లాయి. చందుర్తి మండలం మర్రిగడ్డలో పిడుగుపాటుకు ఎద్దు మృతి చెందింది.
ఇదీ చూడండి: మద్దతు ధరల జాబితాలో పసుపును చేర్చాలి