రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సోమవారం రాత్రి అమ్మవారికి రాజన్న ఆలయంలోని ధర్మగుండంలో అత్యంత వైభవంగా తెప్పోత్సవం నిర్వహించారు. మూడు సార్లు ధర్మగుండంలో స్వామి వార్లు జల విహారం చేశారు. ఈ కార్యక్రమానికి భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. తెప్పోత్సవ కార్యక్రమంలో ఆలయ ఈవో కృష్ణవేణి, సిబ్బంది పాల్గొన్నారు.
ఇవీ చూడండి: దసరా ఉత్సవాల్లో ఎమ్మెల్యే అదిరిపోయే స్టెప్పులు..!