రాజన్న సిరిసిల్ల జిల్లాను పల్లె ప్రగతి కార్యక్రమంలో అగ్రగామిగా నిలబెట్టాలని జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ న్యాలకొండ అరుణ అన్నారు. తంగళ్ళపల్లి మండలంలోని ప్రపుల్లా రెడ్డి ఫంక్షన్ హాల్లో జిల్లాలోని అన్ని మండలాల ప్రజా ప్రతినిధులు, జిల్లా స్థాయి అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా 30 రోజుల ప్రణాళికను స్ఫూర్తిగా తీసుకుని పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ప్రతీ గ్రామంలో పారిశుద్ధ్యం, డంపింగ్ యార్డ్, స్మశాన వాటికలు, ఇంకుడు గుంతల నిర్మాణాలు, హరితహారం మొక్కల పెంపకం లాంటి కార్యక్రమాలు తప్పకుండా చేపట్టాలన్నారు.
ఇవీ చూడండి : సచివాలయం వద్ద రైతులు, మహిళల ధర్నా