రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మూలవాగుపై నిర్మిస్తున్న రెండో వంతెన కూలిపోయిది. రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి మూలవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వంతెన శ్లాబ్‌కు అమర్చిన ఇనుప చువ్వలు విరిగిపోయి వంతెన కూలింది. రూ.28 కోట్లతో నిర్మిస్తున్న రెండు హై లెవెల్ బ్రిడ్జ్ పిల్లర్లు విరిగిపోయాయి. వంతెన నిర్మాణంలో వినియోగించే స్కాఫోల్డింగ్ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. గుత్తేదారు నాణ్యతను విస్మరించినందునే విరిగిపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఇదీ చూడండి: కదిలే సంగీత నిలయం ఆ రైలు...