కరోనా ప్రభావం వల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. ధర్మ గుండంలో స్నానాలు చేయకుండా తాళం వేశారు. భక్తుల సౌకర్యార్థం ధర్మగుండం సమీపంలో షవర్లు ఏర్పాటు చేశారు.
భద్రత చర్యల్లో భాగంగా ఆలయ సిబ్బంది... భక్తులను హెచ్చరిస్తూ వైరస్ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. ఆలయ పరిసరాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.