ఇవీ చూడండి :క్యాన్సర్‌పై పోరాడే నీలి బంగాళదుంప!
చెరువులో మునిగి ఇద్దరు చిన్నారుల మృతి - CHANDURTHI MANDAL
తాము వెళ్లింది చెరువులోకని, లోతు ఎక్కువైతే ప్రాణాలు పోతాయని తెలియని వయసు వారిది. సరదాగా ఈతకు వెళ్లి.. ప్రమాదం గ్రహించలేక ఒకే తరగతి చదివుతున్న ఇద్దరు చిన్నారులు చెరువులో ప్రాణాలు కోల్పోయారు.
చిన్నారుల మృతిని జీర్ణించుకోలేకపోతున్న తల్లిదండ్రులు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈతకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు చెరువులో పడి మృతి చెందారు. చందుర్తి మండలం మర్రిగడ్డ గ్రామానికి చెందిన మనీ, జస్వంత్ ఐదో తరగతి చదువుతున్నారు. వేసవి సెలవులు సందర్భంగా ఆట విడుపు కోసం ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి చనిపోయారు. ఇంటి ముందు ఆడుకోవాల్సిన పిల్లలు కళ్ల ముందే విగతజీవులుగా మారడాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోయారు. ఈ ఘటనతో మర్రిగడ్డ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇవీ చూడండి :క్యాన్సర్‌పై పోరాడే నీలి బంగాళదుంప!