ETV Bharat / state

నేరెళ్లలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు.. పోలీసుల తీరుపై స్థానికుల ఆగ్రహం - trs leaders protest 2021

నేరెళ్లలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు(nerella incident) నెలకొన్నాయి. రైతుల మహాధర్నా(minister ktr in trs dharna) నేపథ్యంలో మంత్రి కేటీఆర్​ పర్యటన సందర్భంగా నేరళ్లలో కోల హరీశ్​ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన బందోబస్తు వివాదానికి దారి తీసింది. అది కాస్తా... పెరిగి పెద్దదై.. ఉద్రిక్తంగా మారింది. అసలు ఏం జరిగిందంటే..?

Tension situation in nerella and Locals angry on police

author img

By

Published : Nov 12, 2021, 10:04 PM IST

నేరెళ్లలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు.. పోలీసుల తీరుపై స్థానికుల ఆగ్రహం

రాజన్న సిరిసిల్ల జిల్లా నేరెళ్లలో మరోసారి ఉద్రిక్త వాతావరణం(nerella incident) నెలకొంది. గతంలో పోలీసులు తనపై థర్డ్​ డిగ్రీ(nerella issue in telangana) ప్రయోగించారని ఆరోపిస్తున్న కోల హరీశ్​ కుటుంబసభ్యులకు పోలీసులకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. తెరాస చేస్తున్న రైతుల మహా ధర్నా(minister ktr in trs dharna)కు మంత్రి కేటీఆర్ పాల్గొనేందుకు వెళ్తున్న నేపథ్యంలో భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసిన సందర్భంలో ఈ ఘటన జరిగింది.

మంత్రి వచ్చిన ప్రతీసారి..

2017లో నేరెళ్ల గ్రామస్థులను పోలీసులు వేధింపులకు గురిచేసారన్న వివాదం నేటికీ కొనసాగుతోంది. తనపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కోల హరీశ్​ అలుపెరుగని పోరాటం చేస్తున్నాడు. అయితే మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్ నుంచి సిరిసిల్ల రావాలంటే నేరెళ్లలోని కోల హరీశ్​ ఇంటి ముందు నుంచే వెళ్లాల్సి ఉంటుంది. మంత్రి వస్తున్న ప్రతీ సారి హరీశ్​.. తనకు న్యాయం చేయాలని నిరసన చేపట్టేవాడు. అయితే.. తనను నివారించేందుకు మంత్రి వచ్చే సందర్భంలో హరీశ్​ ఇంటి వద్ద పోలీసులను భారీగా మోహరిస్తున్నారు.

ముస్తాబాద్​ ఎస్సై తీరుపై ఆగ్రహం..

ఎప్పటిలాగే ఈసారి కూడా.. మంత్రి కేటీఆర్ పర్యటన దృష్ట్యా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసుల బందోబస్తును పలువురు మొబైల్‌లో వీడియోలు తీశారు. వారి ఫోన్లను ముస్తాబాద్ ఎస్సై వెంకటేశ్వర్లు(mustabad si venkateshwarlu) బలవంతంగా స్వాధీనం చేసుకున్నారు. సెల్​ఫోన్లు లాక్కునే క్రమంలో స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో హరీశ్​ కుటుంబ సభ్యులు ఎస్సై తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దౌర్జన్యానికి పాల్పడుతున్నారంటూ మండిపడ్డారు.

బెదిరిస్తే ఊరుకునేది లేదు..

హరీశ్​ కుటుంబసభ్యులను ఇంటి ఆవరణలో పెట్టి గేటు వేయాలని ఎస్సై చూడగా.. వివాదం మరింత పెద్దదైంది. తమ ఇంటికి వచ్చి నిర్బంధించే అధికారం ఎవరిచ్చారని హరీశ్ ​కుంటుబసభ్యులు ప్రశ్నించారు. తాము ఏం తప్పు చేశామని ఇంత మంది పోలీసులు వచ్చి నిర్బంధించేందు ప్రయత్నిస్తున్నారని నిలదీశారు. బెదిరిస్తే ఊరుకునే పరిస్థితి లేదని హెచ్చరించారు. ఈ వాగ్వాదం పెద్దది కావటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం పోలీసులు హరీశ్​ను అక్కడి నుంచి స్టేషన్‌కు తరలిస్తున్నామని చెప్పి తీసుకెళ్లినట్టు అతడి కుటుంబసభ్యులు తెలిపారు. తమపై ముస్తాబాద్​ ఎస్సై వెంకటేశ్వర్లు తమపై దురుసుగా ప్రవర్తించారని హరీశ్​ కుటుంబ సభ్యులు ఆరోపించారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.