ETV Bharat / state

ఆగస్టు 15లోపు మధ్యమానేరుకు కాళేశ్వరం నీరు

స్వాతంత్ర దినోత్సవం నాటికి కాళేశ్వరం జలాలను మధ్యమానేరుకు తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొంది. ఇప్పటికే నీటిని అన్నారం జలాశయానికి తరలిస్తోన్న సర్కార్.. దశల వారీగా మధ్యమానేరుకు తరలించేందుకు ప్రణాళికలు తయారు చేసింది. ఎగువ నుంచి వచ్చే నీటిని ఎప్పటికప్పుడు ఎత్తిపోసేందుకు రంగం సిద్ధం చేశారు.

kaleshwaram
author img

By

Published : Jul 13, 2019, 9:35 AM IST

ఆగస్టు 15లోపు మధ్యమానేరుకు కాళేశ్వరం నీరు

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టి రికార్డు స్థాయిలో పూర్తి చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటి ఎత్తిపోత కొనసాగుతోంది. ప్రాణహిత నుంచి వస్తోన్న జలాలను గోదావరి నదిలోకి కన్నెపల్లి పంపుహౌస్​ నుంచి ఎత్తిపోస్తున్నారు. మేడిగడ్డ ఆనకట్ట గేట్లన్నీ మూసివేయడం వల్ల ప్రాణహిత నుంచి వస్తోన్న ప్రతి నీటి చుక్కను ఒడిసిపడుతున్నారు. నిల్వ చేసిన జలాలను కన్నెపల్లి పంపు​హౌస్​ ద్వారా తరలిస్తున్నారు. అక్కడ నిరంతరం మూడు పంపులు పనిచేస్తున్నాయి. 6,900 క్యూసెక్కుల నీటిని ఎగువకు ఎత్తిపోస్తున్నారు. నీటి లభ్యతను బట్టి నాలుగో పంపునూ వినియోగిస్తున్నారు. శుక్రవారం నాలుగు పంపులు నీటిని ఎత్తిపోశాయి. ఐదో పంపు ద్వారా నీటిని ఎత్తిపోసేందుకు రంగం సిద్ధం చేశారు.

పంపుల పరీక్షలు

కన్నెపల్లి పంపుహౌస్​ ద్వారా ఎత్తిపోస్తున్న జలాలు 14 కిలోమీటర్ల గురుత్వాకర్షణ కాల్వ ద్వారా ప్రయాణించి అన్నారం జలాశయానికి చేరుతున్నాయి. ప్రస్తుతం అన్నారం జలాశయంలో 2.45 టీఎంసీల నీరు నిల్వ చేశారు. అన్నారం పంపుహౌస్​ ద్వారా నీటి ఎత్తిపోతకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే సుందిళ్ల జలాశయంలో నిల్వ ఉన్న కొద్ది పాటి నీటిని పంపుల పరీక్ష కోసం అన్నారం పంపుహౌస్​కు తరలించారు. పంపుహౌస్​ ఫోర్ బే లోకి నీరు వచ్చి చేరింది. పంపుల ఎత్తిపోతకు అవసరమైన పరీక్షలు చేస్తున్నారు. ఈ పరీక్షలు వీలైనంత త్వరగా పూర్తి చేసి వారం రోజుల తర్వాత అక్కడి నుంచి నీటిని ఎత్తిపోయాలని భావిస్తున్నారు. ఈ నీరు సుందిళ్ల జలాశయంలోకి చేరుతుంది. ఇక్కడ నీటిమట్టం ఓ స్థాయికి చేరాక... నీటిని ఎత్తిపోస్తారు. గోలివాడ వద్ద నిర్మించిన సుందిళ్ల పంపు హౌస్​లోని పంపులను పరీక్షించి వచ్చే నెల మొదటి వారంలో అక్కడి నుంచి నీటిని ఎత్తిపోయాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

5పంపుల ద్వారా ఎత్తిపోతకు సిద్ధం

సుందిళ్ల పంపుహౌస్ నుంచి ఎల్లంపల్లి శ్రీపాదసాగర్​కు చేరుకుంటాయి. అక్కణ్నుంచి మధ్యమానేరుకు నీటిని ఎత్తిపోస్తారు. ఈ మార్గంలో ఇప్పటికే ఆరో ప్యాకేజీలో నాలుగు పంపుల పరీక్ష పూర్తైంది. ఐదో పంపు సిద్ధమైంది. ఐదు పంపుల ద్వారా నీటిని 105 మీటర్ల ఎత్తుకు ఎత్తిపోసేందుకు అంతా సిద్ధంగా ఉంది. మరో రెండు పంపుల పనులు కూడా కొనసాగుతున్నాయి. మధ్యలో కీలకంగా మారిన ఏడో ప్యాకేజీ సొరంగం పనులు తుదిదశకు చేరుకున్నాయి. మిగిలి ఉన్న కొంత లైనింగ్ పనులు నెలాఖరుకు పూర్తవుతాయని ఇంజినీర్లు చెబుతున్నారు.

పురోగతిని పర్యవేక్షిస్తున్న సీఎం కేసీఆర్

ఎనిమిదో ప్యాకేజీలోనూ బాహుబలి పంపులు నీటి ఎత్తిపోతకు సిద్ధంగా ఉన్నాయి. అక్కడున్న 139 మెగావాట్ల సామర్థ్యం కలిగిన అతిపెద్ద పంపుల పరీక్ష కూడా ఇప్పటికే పూర్తైంది. నీరు వచ్చిన వెంటనే పరీక్షించి ఎత్తిపోతకు రంగం సిద్ధం చేశారు. ఎల్లంపల్లి నుంచి మధ్యమానేరుకు నీటిని.. వచ్చే నెల రెండో వారంలో తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు ఇంజినీర్లకు లక్ష్యాన్ని నిర్దేశించిన ముఖ్యమంత్రి కేసీఆర్... పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. స్వాతంత్ర దినోత్సవమైన ఆగస్టు 15 నాటికి కాళేశ్వరం జలాలను మధ్యమానేరుకు తరలించేలా ప్రభుత్వం ఆలోచిస్తోంది.

ఇదీ చూడండి: పంచాయతీ రాజ్​ చట్టంపై కేసీఆర్​ దిశానిర్దేశం

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.