వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వ వివాదంపై హైకోర్టు విచారణ జరిపింది. చెన్నమనేని రమేశ్‌కు ఇప్పటికీ జర్మనీ పౌరసత్వం ఉందని కేంద్రం హైకోర్టుకు తెలిపింది. 2023 వరకు జర్మనీ పౌరసత్వాన్ని పొడిగించుకున్నారని తెలిపిన కేంద్ర హోంశాఖ మెమో రూపంలో వివరాలు సమర్పించింది.
దీనిపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. అఫిడవిట్ రూపంలో వివరాలు సమర్పించాలని స్పష్టం చేసింది. ఈ వివాదంపై విచారణను జనవరి 20వ తేదికి వాయిదా వేసింది.
ఇదీ చూడండి: సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట