మానేరు జలాశయంలో ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని మత్స్యకారులు కాపాడారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కిసాన్‌నగర్‌కు చెందిన ముల్కల దేవయ్యగా అతన్ని గుర్తించారు. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక వంతెన వద్ద జరిగింది.
చెట్ల కొమ్మలు పట్టుకుని ఆర్తనాదాలు
మానేరు జలాశయంలో దూకి ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తి చెట్ల కొమ్మలు పట్టుకుని రక్షించమంటూ ఆర్తనాదాలు చేశాడు. అతని అరుపులు విన్న మత్స్యకారులు పోలీసులకు సమాచారం అందించారు. అతన్ని కాపాడేందుకు మొదట తెప్పల సాయంతో ప్రయత్నించారు. చెట్టు కొమ్మల సాయంతో రెండు గంటల పాటు భయంతో అలాగే జలాశయం ప్రవాహంలో ఉండిపోయాడు. చివరికి గజ ఈతగాళ్ల సాయంతో మత్స్యకారులు అతన్ని వెలికి తీశారు. రక్షించిన వారికి అతను కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చూడండి: