ETV Bharat / state

health profile Program: ఆరోగ్య సూచీలకు వచ్చే నెలలో శ్రీకారం... మెుదట ఆ జిల్లాల్లో ప్రారంభం.. - తెలంగాణ వార్తలు

ప్రజల ఆరోగ్య ముఖచిత్రాన్ని భద్రపరిచే కార్యక్రమాన్ని వచ్చే నెలలో ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో.. క్షేత్రస్థాయిలో వైద్యసిబ్బంది ఇంటింటా పరీక్షలు నిర్వహించడానికి ఇదే సరైన సమయమని వైద్యశాఖ భావిస్తోంది. ప్రయోగాత్మకంగా రాజన్న సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో ప్రారంభంకానుంది.

health profile
health profile
author img

By

Published : Nov 11, 2021, 6:55 AM IST

రాష్ట్ర ప్రజల ఆరోగ్య ముఖచిత్రాన్ని(హెల్త్‌ ప్రొఫైల్‌) భద్రపరిచే కార్యక్రమానికి వచ్చే నెలలో శ్రీకారం చుట్టనున్నారు. . ప్రయోగాత్మకంగా రాజన్న సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో ప్రారంభించాలని ఇప్పటికే నిర్ణయించిన నేపథ్యంలో.. ఆయా జిల్లాల్లో ప్రారంభానికి అవసరమైన ఏర్పాట్లపై వైద్యఆరోగ్యశాఖ దృష్టి సారించింది. ఆరోగ్య సూచీలను గుర్తించడానికి అవసరమైన నిర్ధారణ పరీక్షల పరికరాలు, ఇతర వస్తువుల కొనుగోలుకు తొలి విడతగా రూ.9.15 కోట్లు నిధులను ప్రభుత్వం తాజాగా మంజూరు చేసింది. వైద్య పరికరాల కొనుగోలుకు తెలంగాణ రాష్ట్ర వైద్యసేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) యుద్ధప్రాతిపదికన సన్నాహాలు చేస్తోంది. వైద్యసిబ్బందికీ శిక్షణ ఇప్పించనున్నారు. ప్రస్తుతం కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో.. క్షేత్రస్థాయిలో వైద్యసిబ్బంది ఇంటింటా పరీక్షలు నిర్వహించడానికి ఇదే సరైన సమయమని వైద్యశాఖ భావిస్తోంది.

ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు..

గ్రామాల్లో వైద్యసిబ్బంది ఇంటింటికి వెళ్లి.. 18 ఏళ్లు పైబడిన ప్రతి వ్యక్తి ఆరోగ్య సూచీని సేకరిస్తారు. వాటిని ఎప్పటికప్పుడూ ఆన్‌లైన్‌లో పొందుపర్చుతారు. ప్రజల నుంచి రక్త, మూత్ర నమూనాలనూ సేకరిస్తారు. వీటిని సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో(పీహెచ్‌సీల్లో) పరీక్షిస్తారు. పరీక్షల నిర్వహణ కోసం అవసరమైన పరికరాలను పీహెచ్‌సీల్లో అందుబాటులో ఉంచనున్నారు. ప్రతి వ్యక్తికి ఒక ఏకీకృత నంబరు కేటాయిస్తారు. దీని ఆధారంగా ఆ వ్యక్తి ఆరోగ్య సూచీని తెలుసుకునే అవకాశం ఉంటుంది. పరీక్షలకు అవసరమైన వైద్య పరికరాలకు రూ.5,53,72,765 వ్యయమవుతాయని అంచనా వేశారు. వీటిలో వినియోగించే వస్తువులు, రసాయనాల కొనుగోలుకు అవసరమైన నిధులను ప్రాథమికంగా రెండు జిల్లాల్లోని 20 శాతం ప్రజల కోసమే కేటాయించారు. ఇందుకు రూ.3,62,03,948 ఖర్చవుతాయని అధికారులు అంచనా వేశారు.

పీహెచ్‌సీల్లో చేసే పరీక్షలు..

* సంపూర్ణ రక్త పరీక్ష (సీబీపీ)

* సంపూర్ణ మూత్రపరీక్ష (సీయూఈ)

* మూత్రపిండాల పనితీరును తెలుసుకునేలా అల్బుమిన్‌, బ్లడ్‌ యూరియా, సీరమ్‌ క్రియేటినైన్‌, ఆల్కలైన్‌ ఫాస్ఫటేజ్‌(ఏఎల్‌పీ)

* రక్తంలో షుగర్‌ స్థాయి, మూణ్నెళ్ల చక్కెర స్థాయి

* కాలేయ పనితీరును తెలుసుకొనే టోటల్‌ బిల్‌రుబిన్‌, డైరెక్ట్‌ బిల్‌రుబిన్‌, ఎస్‌జీపీటీ, ఎస్‌జీవోటీ

* కొలెస్ట్రాల్‌ స్థాయులను కనుగొనే టోటల్‌ కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిసరైడ్స్‌, హెచ్‌డీఎల్‌ కొలెస్ట్రాల్‌

* గుండె పనితీరును ప్రాథమికంగా కనుగొనేందుకు ఈసీజీ

ఇంటి వద్ద చేసే పరీక్షలు..

* జ్వరం

* రక్తపోటు

* రక్తహీనత

* రక్తంలో చక్కెర స్థాయులు

* ఎత్తు, బరువు

* బ్లడ్‌ గ్రూప్‌

* శరీరంపై కణతులు

* రక్తంలో ప్రాణవాయువు

* గుండె కొట్టుకునే తీరు

* ఇతర అనారోగ్య సమస్యలున్నాయా అనే సమాచారాన్నీ సేకరిస్తారు.

ఇదీ చదవండి: new zonal system: వీడని జోనల్​ పీటముడి.. నిరుద్యోగుల ఎదురుచూపులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.