క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడతాయని టెస్కబ్ ఛైర్మన్ కొండూరు రవీందర్రావు పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన వాలీబాల్ పోటీల్లో గెలుపొందిన జట్లకు ఆయన బహుమతులను అందజేశారు.
ఫైనల్ పోటీల్లో పెగడపల్లి, సిరిసిల్ల జట్లు తలపడగా... పెగడపల్లి ప్రథమ స్థానంలో, సిరిసిల్ల ద్వితీయ స్థానంలో నిలిచాయి. గెలుపొందిన ఇరు జట్లకు నగదు పారితోషికంతో పాటు ట్రోఫిని తెరాస రాష్ట్ర నాయకులు చీటి నర్సింగరావుతో కలిసి ఆయన అందజేశారు.
ఇదీ చూడండి : సాగును ప్రేమించాడు.. కొలువును త్యజించాడు.. నగధీరుడయ్యాడు!