ETV Bharat / state

లాక్​డౌన్​కు ప్రజలు సహకరిస్తున్నారు: ఎస్పీ రాహుల్ హెగ్డే - lock down news

లాక్​డౌన్​కు ప్రజలు సహకరిస్తున్నారని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్​ హెగ్డే అన్నారు. జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి లాక్​డౌన్​ అమలు తీరును పరిశీలించారు.

లాక్​డౌన్​కు ప్రజలు సహకరిస్తున్నారు: ఎస్పీ రాహుల్ హెగ్డే

author img

By

Published : May 14, 2021, 4:40 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా మూడో రోజు లాక్​డౌన్​ కొనసాగుతోంది. ఎస్పీ రాహుల్ హెగ్డే క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ లాక్​డౌన్ అమలు తీరును పర్యవేక్షిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్​ చౌరస్తా, పాతబస్టాండ్, వెంకపేట్, సుందరయ్య నగర్, బి.వై నగర్, ఇందిరానగర్, కొత్త బస్టాండ్ ప్రాంతలాల్లో పర్యటించారు.

అనవసరంగా రోడ్ల మీదకు వచ్చిన వాహనదారులకు జరిమానా విధించాల్సిందిగా సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం విధించిన లాక్​డౌన్​ జిల్లా పరిధిలో చాలా కఠినంగా అమలు అవుతుందన్నారు. అన్ని వర్గాల వారు ఈ లాక్​డౌన్​కు సహకరిస్తున్నారని తెలిపారు.

నిబంధనలు ఉల్లంఘించిన 280 మందిపై కేసులు నమోదు చేయడంతోపాటు, 12 దుకాణలపై కూడా కేసులు నమోదు చేశామన్నారు. ఎస్పీతో పాటు డీఎస్పీ చంద్రశేఖర్, సీఐ అనిల్ కుమార్, ఎస్​ఐ సుధాకర్ పాల్గొన్నారు.

ఇదీ చదవండి: రాష్ట్ర సరిహద్దుల్లో అంబులెన్స్‌ల నిలిపివేతపై హైకోర్టులో పిల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.