రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలో విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో చైనా అధ్యక్షుడి దిష్టిబొమ్మ దహనం చేశారు. భారత్-చైనా సరిహద్దులో చైనా సైనికుల దురాగతానికి బలైన భారత సైనికులకు నివాళులు అర్పించారు. చైనాకు తగిన మూల్యం చెల్లించేందుకు దేశవ్యాప్తంగా చైనా వస్తువులు బహిష్కరించాలని, ప్రజలెవరూ చైనా వస్తువులు కొనొద్దంటూ పిలుపునిచ్చారు.
తెలంగాణకు చెందిన కర్నల్ సంతోష్ బాబుకు నివాళులు అర్పిస్తూ దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికుల కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. చైనాకు తగిన బుద్ధి చెప్పేలా, భారత్ సత్తాను ప్రపంచానికి తెలిసేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఈటల