ETV Bharat / state

Siricilla Sinare Center: నిరుద్యోగుల ఆశాదీపం.. సినారె స్మారక కేంద్రం

Siricilla Sinare Center: గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు ఆశాదీపంగా నిలుస్తోంది సిరిసిల్లలోని సినారె స్మారక కేంద్రం. సాహితీవేత్త డాక్టర్ సి.నారాయణరెడ్డి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన గ్రంథాలయంలోనే టాస్క్‌ కేంద్రాన్ని నెలకొల్పారు. నైపుణ్యాలతోపాటు విజ్ఞానాన్ని పంచుతూ యుువతను విజయతీరాలకు చేర్చుతున్న సిరిసిల్ల సినారె మందిరంపై ఈటీవీ భారత్ కథనం.

Siricilla Sinare Center
Siricilla Sinare Center
author img

By

Published : Dec 17, 2021, 5:48 PM IST

Siricilla Sinare Center: పోటీ పరీక్షల సన్నద్ధతకే కాకుండా ఉపాధికి అవసరమైన నైపుణ్యాలను అందిస్తోంది రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సినారె స్మారక గ్రంథాలయం. ప్రెంఛ్ నిర్మాణ శైలీలో మూడున్నర కోట్ల రూపాయలతో కట్టిన భవనం పట్టణానికే కొత్త అందాన్ని తెచ్చిపెట్టింది. ఆహ్లాదకరంగా పరిసరాలను తీర్చిదిద్దారు.

కేటీఆర్ చొరవతో...

ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో గ్రంథాలయ భవనంలో టాస్క్‌ కేంద్రం ఏర్పాటు చేశారు. 25 కంప్యూటర్లు, 40 వేల పుస్తకాలు సమకూర్చారు. యువతకు శిక్షణ కోసం ప్రత్యేకంగా శిక్షకులకు నియమించారు. టాస్క్‌ ద్వారా సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు పొందేందుకు అవసరమైన నైపుణ్యాలను అందిస్తున్నారు.

పోటీ పరీక్షలకు...

టాస్క్‌లో డీబీఎంఎస్, జావా, సీ, సీ-ప్లస్‌ ప్లస్‌, పైతాన్‌, ఒరాకిల్‌ వంటి ప్రోగ్రాములను వర్చువల్ పద్థతిలో నేర్పిస్తున్నారు. సివిల్స్‌, ఆర్ఆర్​బీ వంటి పోటీ పరీక్షలకు యువతను తీర్చిదిద్దుతున్నారు. ప్రైవేటుగా సాంకేతిక శిక్షణ పొందాలంటే.. లక్షల రూపాయల ఫీజులు చెల్లించాల్సి ఉంటుందని.. టాస్క్‌ తమకు ఎంతో ఉపయోగపడుతుందని యువత ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

టాస్క్‌లో ఒక్కో బ్యాచ్‌లో 40 నుంచి 50 మందికి శిక్షణ ఇచ్చేందుకు అవకాశం ఉంది. గ్రంథాలయంతోపాటు టాస్క్‌ కేంద్రాన్ని ఉపయోగించుకోవాలని శిక్షణ పొందుతున్నవారు కోరుతున్నారు. సినారె స్మారక గ్రంథాలయ మందిరం యువత భవితకు దారి చూపడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

నిరుద్యోగుల ఆశాదీపం.. సినారె స్మారక కేంద్రం

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.