ETV Bharat / state

సిరిసిల్ల డ్రైవింగ్‍ శిక్షణాకేంద్రం... ఉపాధికి ఊతం

అంతర్జాతీయ ప్రమణాలతో సిరిసిల్లలో ఏర్పాటు చేసిన డ్రైవింగ్ స్కూల్.. నిరుద్యోగుల పట్ల కల్పతరువుగా మారింది. ఔత్సాహికులకు భోజనం వసతితోపాటు శిక్షణ ఇవ్వడమే కాకుండా ఉపాధిని కూడా కల్పించేందుకు దోహదపడుతోంది. ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభమై ఏడాది పూర్తికాగా ఇప్పటివరకు.. పది బ్యాచులకు శిక్షణ పూర్తయ్యింది. అన్ని రకాల వాహనాల డ్రైవింగ్‌లో తర్ఫీదు ఇస్తుండటం.. ఇక్కడ శిక్షణ పొందిన వారికి దేశ, విదేశాల్లో మంచి డిమాండ్‌ ఉంటోంది.

Siricilla Hitech Driving School Creates Employment
సిరిసిల్ల డ్రైవింగ్‍ శిక్షణాకేంద్రం... ఉపాధికి ఊతం
author img

By

Published : Jul 8, 2022, 6:59 PM IST

సిరిసిల్ల డ్రైవింగ్‍ శిక్షణాకేంద్రం... ఉపాధికి ఊతం

సిరిసిల్లలో రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన అంతర్జాతీయ డ్రైవింగ్ స్కూల్లో.. అన్ని జిల్లాల వారికి శిక్షణ ఇస్తున్నారు. దీనికి కేంద్రం మంజూరు రూ.16 కోట్లు మంజూరు చేయాగా.. రాష్ట్ర ప్రభుత్వం 20ఎకరాల స్థలం కేటాయింది. అశోకలేలాండ్‌తో సంయుక్తంగా ఇక్కడ ఇంటర్నేషనల్‌ డ్రైవింగ్‌ స్కూల్‌ను ఏడాది క్రితం ఏర్పాటు చేశారు. ఇక్కడ శిక్షణ పొందిన చాలామంది ఇప్పటికే ఉద్యోగావకాశాలు పొందారు. జిల్లాలో తంగళ్లపల్లి మండలంలోని మండెపల్లిలో డ్రైవింగ్‌ శిక్షణ, పరిశోధన కేంద్రంను ఏడాది క్రితం ముఖ్యమంత్రి ప్రారంభించారు. 5 ఎకరాల్లో పరిపాలన వసతి గృహ భవనాలు, 15 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన డ్రైవింగ్‌ స్కూల్‌ ట్రాక్‌లు నిర్మించారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న భారీ వాహనాల శిక్షణ, చిన్న వాహనాల శిక్షణ నిరుద్యోగులకు వరం లాంటిది. కేసీఆర్ చేతుల మీదుగా ఇది ప్రారంభమైంది. మా దగ్గర శిక్షణ తీసుకున్న విద్యార్థులు ఉద్యోగాలు చేస్తున్నారు. వారికి దాదాపు 30వేల వరకు జీతం వస్తోంది. ఉచిత భోజనం, వసతి, ఫ్రీగా డ్రైవింగ్ నేర్పించడం, లైసెన్స్ ఇప్పించడం... ఇవ్వన్నీ ఉచితంగా ఇస్తున్నాం. - వై.వి. రావు, శిక్షణ కేంద్రం నిర్వాహకులు

విదేశాల్లో వాహనాలు నడపడంలో మెళుకువలు తెలుసుకునేందుకు డిజిటల్‌ గ్రంథాలయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. డ్రైవింగ్‌ స్కూల్‌లో మూడున్నర కిలోమీటర్లమేర విశాలమైన ట్రాక్‌ నిర్మించారు. వీటిలో నాలుగు లేన్లు, ఆరు లేన్ల ట్రాకులు కూడా ఏర్పాటు చేశారు. 180 మందికి వసతి, మరో 200ల మందికి డేస్‌ స్కాలర్‌ చొప్పున లైట్‌ మోటారు వెహికల్‌, ట్రాన్స్‌పోర్టు డ్రైవర్లకు మూడు నెలల కాలపరిమితితో శిక్షణ ఇచ్చే అవకాశముంది. శిక్షణ పొందిన వారికీ లైసెన్స్‌తోపాటు ధ్రువపత్రాలు అందిస్తారు. ఒక్కో బ్యాచ్‌లో 30 మంది చొప్పున.. ఏటా సగటున 4వేల మందిశిక్షణ పొందే అవకాశముంది. పాఠ్యాంశాలు, వాహనాలు నడపడంలో ఆయా విభాగాల్లో అనుభవజ్ఞులైన అధ్యాపకులతో అశోక్‌ లేలాండ్‌ సంస్థ శిక్షణ ఇస్తోంది.

డిగ్రీ పూర్తి చేసుకుని ఖాళీగా ఉన్న సమయంలో దీని గురించి తెలుసుకుని ఇందులో చేరాం. హాస్టల్, భోజనం సదుపాయాలు బాగున్నాయి. డ్రైవింగ్ నేర్పిస్తున్నారు. మూడు నెలల శిక్షణ ఉంటుంది. ఇప్పుడు ట్రాక్ మీద ఉన్నాం. లోపల 3కి.మీటర్ల స్థలం ఉంటుంది. అందులోనే ప్రాక్టీస్ చేస్తాం. తర్వాత గతుకుల రోడ్లపై డ్రైవింగ్, నైట్ టైం డ్రైవింగ్ ఇవన్నీ నేర్పిస్తున్నారు. -విద్యార్థులు

పదోతరగతి ఆపై చదువుకున్న వారు శిక్షణ పొందేందుకు అర్హులు. దూరప్రాంతాల నుంచి ఇక్కడ శిక్షణకు వస్తున్నా … ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి మాత్రం అభ్యర్థులు అంతతంతమాత్రమే ఉంటున్నారు. కేవలం 3 నెలల శాస్త్రీయ పద్దతిలో స్నేహపూర్వక వాతావరణంలో శిక్షణ పొందే అవకాశం ఉందని శిక్షణార్థులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.నైపుణ్యంతో కూడిన డ్రైవింగ్ శిక్షణ పొందాలనుకునే నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి కోరుతున్నారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.