రెండేళ్లుగా జాతీయ, అంతర్జాతీయ విపణిలో వస్త్రోత్పత్తుల ఎగుమతులు భారీగా తగ్గాయి. ఫలితంగా నేత(sircilla weavers) పరిశ్రమపై ఆధారపడి జీవించే కుటుంబాలకు ఉపాధి కరవైంది. రాష్ట్ర ప్రభుత్వ ఆర్డర్లతో సిరిసిల్ల(sircilla weavers) నేతన్నలకు కొంత ఊరట లభిస్తోంది. అరకొరగా సాగుతున్న ప్రైవేటు వస్త్రోత్పత్తులతో కూలీ దొరకడం గగనంగా మారింది. ఇలాంటి పరిస్థితిలో తమిళనాడు చీరల(Pongal Sarees) ఆర్డర్లు వారికి ఊతంగా మారాయి.
30 లక్షల మీటర్లు
అక్కడి ప్రభుత్వం సంక్రాంతి కానుకగా నిరుపేదల(Pongal Sarees)కు ఇచ్చే 3 కోట్ల 12 లక్షల చీరలు, పంచెల పంపిణీకి రంగం సిద్ధం చేసింది. దీనికోసం యేటా రూ. 485 కోట్లను కేటాయిస్తోంది. వాటిలో ఒక కోటి 56 లక్షల చీరలున్నాయి. వీటిలో జిల్లాలో 30 లక్షల మీటర్ల ఆర్డర్లను 700 మరమగ్గాలపై ఉత్పత్తి ప్రారంభించారు. ఒక్కో కార్మికునికి రోజుకు సగటున నాలుగు వందల రూపాయల కూలీ గిట్టుబాటు అవుతుంది. ముడి సరకు తమిళనాడు(Pongal Sarees) నుంచే వస్తుంది. ఉత్పత్తి అయిన చీరలను సేకరించి రవాణా, ప్రాసెసింగ్, ప్యాకింగ్ అంతా అక్కడే జరుగుతుంది.

కాటన్ పరిశ్రమకూ తెలంగాణ ఊతమివ్వాలి..
తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే బతుకమ్మ చీరలకు ఉపయోగించే నూలు పూర్తిగా పాలిస్టర్. చీర అంచుల్లో డాబీ, జకాట్ పరికరాలతో బంగారు వర్ణాల్లో డిజైన్లు ఉంటాయి. తమిళనాడు చీరలకు(Pongal Sarees) అక్కడి ప్రభుత్వం ప్రత్యేకంగా ఎయిర్‌టెక్స్ పాలిస్టర్ నూలును తయారు చేయిస్తోంది. పంచెల్లో 40 శాతం కాటన్, 60 శాతం పాలిస్టర్ కలిపి వాడతారు. పంచెల తయారీతో అక్కడి కాటన్ పరిశ్రమ నిలదొక్కుకుంటోంది. తెలంగాణకు చీరల ఆర్డర్లు మాత్రమే ఇచ్చింది. తమిళనాడు మాదిరిగా చీరలతో పాటు కాటన్ పరిశ్రమకు ఆర్డర్లు కేటాయించేలా చూడాలని జిల్లా పరిశ్రమ వర్గాలు(sircilla weavers) తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.

2012లో తమిళనాడు చీరల కాంట్రాక్టు సిరిసిల్లకు వచ్చింది. అప్పటినుంచి విజయవంతంగా నడుస్తోంది. మన రాష్ట్ర చీరలను కూడా ఇదే మాదిరిగా నేస్తున్నాం. సెప్టెంబరు నుంచి డిసెంబరు తమిళనాడు సంక్రాంతి చీరల ఉత్పత్తి జరుగుతుంది. -మ్యాన సురేష్, ఆసామి, సిరిసిల్ల
జిల్లా వస్త్ర పరిశ్రమకు తొలిసారి 2012లో తమిళనాడు చీరల(Pongal Sarees) ఆర్డర్లు వచ్చాయి. అప్పటి నుంచే సిరిసిల్ల మరమగ్గాల(sircilla weavers)పై చీరలను ఉత్పత్తి చేయవచ్చనేది దేశ వ్యాప్తంగా ప్రచారమైంది. తమిళనాడు చీరల(Pongal Sarees) ఆర్డర్ల కోసం మరమగ్గాలను అద్దెకు తీసుకుని నడిపిస్తుండటంతో పెట్టుబడులకు ఇబ్బందిలేదు. బతుకమ్మ చీరల తర్వాత మరో మూడు నెలలు ఆసాములు, కార్మికులకు ఉపాధి లభిస్తుంది.
ఇదీ చదవండి: All india saree mela in hyderabad: శిల్పారామంలో ఆల్‌ఇండియా శారీ మేళా నేటినుంచే..